Pakistani Film Actress Sangeeta: పాకిస్థాన్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంటుందని అందరికి తెలుసు. అయితే అక్కడ అతి తక్కువ సంఖ్యలో హిందువులు కూడా నివసిస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలిసింది. 1947లో విభజన జరిగినప్పటి నుంచి కొందరు అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో 'సంగీత' ఒకరు. ఈమె ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అత్యంత ధనిక హిందూ మహిళ కావడం విశేషం. ఇంతకీ సంగీత ఎవరు? ఆమె సంపాదన ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన వేళ అత్యంత సంపన్నుల జాబితాలో హిందువులు కూడా ఉండటం గమనార్హం. ఇందులో అత్యంత ధనిక హిందువు 'దీపక్ పెర్వానీ' అనే ఫ్యాషన్ డిజైనర్ కాగా, ధనిక హిందూ మహిళగా 'సంగీత' రికార్డ్ సృష్టించింది. వీరిద్దరూ కూడా సినీ రంగానికి చెందినవారు కావడం మరో గొప్ప విషయం.
సంగీత పాకిస్థాన్‌లో ప్రముఖ నటి. ఈమెను 'పర్వీన్ రిజ్వీ' (Parveen Rizvi) అని కూడా పిలుస్తారు. అయితే తన పేరు అక్కడ మతానికి వ్యతి రేఖంగా ఉండటం వల్లే పర్వీన్ రిజ్వీగా పేరు మార్చుకుంది. విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్‌లో జీవనం సాగిస్తోంది. కాగా ఇప్పుడు పాకిస్థాన్‌లో అత్యంత ధనిక మహిళగా రికార్డ్ సృష్టించింది.
(ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!)
పర్వీన్ రిజ్వీ కేవలం నటి మాత్రమే కాదు, చిత్ర దర్శకురాలు కూడా. ఈమె కోహ్-ఎ-నూర్ అనే సినిమాతో సినీ రంగంలో అరంగేట్రం చేసినప్పటికీ.. తన 21 ఏట నుంచి ఈ రంగంలో మరింత దృఢంగా నిలదొక్కుకోగలిగింది. నికాహ్, ముత్తి భర్ చావల్, యే అమన్, నామ్ మేరా బద్నామ్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ఒక పాపులర్ నటిగా గుర్తింపు పొందగలిగింది.
(ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం)
సంగీత కేవలం పాకిస్థాన్‌లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి 'జియా ఖాన్'కు అత్త. సంగీత సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది అనే విషయం ఖచ్చితంగా అందుబాటులో లేదు, కానీ ఈమె ఏడాదికి సుమారు రూ. 39 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె సంపాదన అంతకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment