అభిమానుల అత్యుత్సాహం.. స్టార్‌హీరోకు గాయాలు | Vijay Visits Puducherry And Gets Mobbed By A Sea Of Fans | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 16 2018 8:40 AM | Last Updated on Sun, Sep 16 2018 8:40 AM

Vijay Visits Puducherry And Gets Mobbed By A Sea Of Fans - Sakshi

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందన్నది నటుడు విజయ్‌కు శుక్రవారం అనుభవంలోకి వచ్చింది. ఆయన ఇబ్బంది పడడంతో పాటు గాయాలపాలయ్యా రు. వివరాలు చూస్తే విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. విజయ్‌ అఖిలభారత అభిమాన సంఘం అధ్యక్షుడు, పాండిచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఆనంద్‌ కూతురు వివాహం శుక్రవారం పాండిచ్చేరిలో జరింగింది. ఈ వేడుకకు నటుడు విజయ్‌ వస్తున్నారన్న విషయాన్ని ముందుగానే ఆనంద్‌ అభిమానులందరికీ తెలియజేశారు.

కల్యాణ మండపం ప్రాంతంలో విజయ్‌ ఫొటోలతో కూడిన పోస్టర్లలను, కటౌట్‌లను ఏర్పాటు చేశారు. విజయ్‌ తన సతీమణి సంగీతతో కలిసి వధూవరులను ఆశీర్వదించడానికి శుక్రవారం సాయంత్రం పాండిచ్చేరికి వెళ్లారు. కల్యాణమండపంలోకి వెళ్లగానే అభిమానులు ఆయన్ని చుట్టు ముట్టారు. బౌన్సర్లు అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. విజయ్‌ అలాగే వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించే ప్రయత్నం చేశారు. అయితే అభిమానుల తోపులాటతో ఆయన కిందపడబోయారు. కాలికి దెబ్బ కూడా తగి లింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠిచార్జ్‌ చేసి విజయ్‌ సంగీత దంపతులను సురక్షితంగా అక్కడి నుంచి పంపించేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement