Actor Thiruveer about how he got offer in 'Masooda' movie - Sakshi
Sakshi News home page

Actor Thiruveer : 'మసూద ఆడిషన్‌.. ఇంగ్లీష్‌లో డైలాగ్‌, ఐదారు టేకులు తీసుకున్నా'

Published Mon, Nov 28 2022 3:08 PM | Last Updated on Mon, Nov 28 2022 8:01 PM

Actor Thiruveer About How He Got Offer In Masooda Movie - Sakshi

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

► పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది.మసూద డైరెక్టర్‌ నన్ను ఓ సారి కలిశాడు. కలిసినంత మాత్రాన నిన్ను సినిమాలో తీసుకుంటానని అనుకోకు.. నిర్మాతకు నచ్చితేనే తీసుకుంటాను అని అన్నారు. ఆడిషన్ కోసం ఓ సీన్ చేశాం. అందులో ఇంగ్లీష్‌ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఐదారు టేక్స్ తీసుకున్నా. ఇక సినిమా ఆఫర్ రాదని అనుకున్నా. కానీ చివరకు దర్శక నిర్మాతలకు నచ్చింది. మసూద ఆఫర్ వచ్చింది.

ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చాయి. అలాంటి కారెక్టర్లే నేను చేస్తానా? వాటికే సూట్ అవుతానా? అనే భావన నాలో కలిగేలా చేశారు. అందుకే అందులోంచి బయటకు రావాలి, వెరైటీ పాత్రలు చేయాలని అనుకున్నా. పైకి ఎవ్వరూ చెప్పకపోయినా కూడా అందరికీ హీరో అవ్వాలని ఉంటుంది. చిన్నప్పటి నుంచి గోడ మీద పోస్టర్లు చూసి కథలు అనుకుంటూ ఉండేవాడిని. పలాస టైంలోనూ నా పోస్టర్ ఉంటుంది. కానీ మసూద నాది అఫీషియల్‌గా ఫస్ట్ పోస్టర్.

ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచీ చీకటి అంటే భయం. నేను నా జీవితంలోనూ గోపీలానే ఉంటాను. నాకు ఈ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో చేసిన కారెక్టర్లే కష్టంగా అనిపించాయి. మసూదలో క్లైమాక్స్‌లో చేసిన స్టంట్స్ కాస్త కష్టంగా అనిపించాయి.

నాకు చిన్నప్పటి నుంచి నటీనటులను చూడటం ఇష్టం. షూటింగ్‌లు జరిగే సమయంలో వారిని చూసి తెగ సంబరపడిపోయేవాడిని.  శుభలేక సుధాకర్, సంగీత, సత్యం రాజేష్ ఇలా అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. వారితో పని చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలం.

► నేను చేసిన చిత్రాలన్నీ అవార్డ్ విన్నింగ్, విమర్శకుల ప్రశంసలు వచ్చేలానే ఉంటాయి. మల్లేశం, పలాస, జార్జిరెడ్డి వల్ల నేను ఇండస్ట్రీ జనాలకు తెలిశాను. కానీ మసూదలో గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్స్ వరకు చేరాను. నన్ను వారు గుర్తు  పడుతున్నారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెడుతున్నారు. 

► మసూదతో నాలోని ఇంకో కోణం కూడా అందరికీ తెలిసిందే. నెగెటివ్ మాత్రమే కాదు ఇలాంటి పాత్రలు కూడా పోషించగలడని అంతా నమ్ముతున్నారు. దిల్ రాజు గారికి నా పాత్ర చాలా నచ్చింది.

► ఒకప్పుడు నేను ఎక్కువగా మీమ్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు నా మీద మీమ్స్ వేస్తున్నారు. గోపీ పాత్రతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

► హీరో అనే ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ప్రకాష్‌ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని జనాలు అనుకుంటే చాలు.

► నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేది మరో సెంటిమెంట్‌ కూడా యాడ్ అయింది. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో తిరువీర్ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది.

► ప్రస్తుతం పరేషాన్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మోక్షపటం అనే చిత్రం కూడా లైన్‌లో ఉంది. వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ ఉంది. పారాహుషార్ అనే మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. అలా మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. కొత్తగా ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. కథ నచ్చితేనే సినిమాలు చేద్దామని, కౌంట్ కోసం చేయకూడదని అనుకుంటాను.

► కమల్ హాసన్ ద్రోహి, విచిత్ర సోదరులు, స్వాతి ముత్యం ఇలా వెరైటీ కథలు, కారెక్టర్లు చేయాలని ఉంది. అయితే రెమ్యూనరేషన్ కోసం మాత్రం సినిమాలు చేయను. కథ, స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement