
సాక్షి, హైదరాబాద్ : తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం ఆరో రోజుకు చేరింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తున్నారు. రోజురోజుకూ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వచ్చిన సామాజికవేత్తల, రాజకీయ నాయకుల ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు.
సంగీతకు మొదటగా ఆర్ధిక సాయం చేసి, దీక్ష విరవింపజేయిస్తే బాగుంటుందన్నది కొంత మంది మహిళా నేతల ఆలోచనగా ఉంది. తన బిడ్డ భవిష్యత్తు కోసం అయినా ఆమెకు కొంత ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలని సంగీత కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. సంగీత కోరుతున్న షరతులకు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విరవింపజేసేలా చూస్తామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment