‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదల కానుంది. చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు... యువ దర్శకులు చూశారు. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంద్భంగా యువ దర్శకులు స్వరూప్ అర్. ఎస్. జే, వెంకటేశ్ మహా, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే... హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు. దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ... కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు, అలా క్రియేట్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించారు. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు.
చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment