
హైదరాబాద్: మూడో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద పోరాటం చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతోపాటు ఆమె కుమార్తె ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఆమె చేపట్టిన న్యాయ పోరాటం నాలుగో రోజుకు చేరింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. నాలుగు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ధర్నా కొనసాగిస్తున్నా అత్తింటి వారి నుంచి స్పందన లేదు. అత్తామామలు లేదా ప్రభుత్వం తనకు హామీ ఇచ్చే వరకు ఇంటిముందే పోరాటం సాగిస్తానంటోన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment