అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి
హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సదస్సు
మాదాపూర్: గుండె సమస్యలపై అందరికీ అవగాహన అవసర మని అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం 3 రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గుండె సమస్యల నుంచి ఉపశమనానికి అనేక కొత్త పద్ధతులున్నాయ న్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియా లజీ రోగిని గాయం, అనారో గ్యం, మరణాల నుంచి కాపాడు తుందని తెలిపారు.
గతంలో ధమనులు పూర్తిగా బ్లాక్ అయిన ప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారన్నారు. ఇప్పుడు ధమ నులను క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయ న్నారు. రోగులు కోలుకోవడా నికి సాధ్యమైనంత వరకు చౌకగా ఉండే తాజా పద్ధతులపై ప్రతినిధులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్డియాలజిస్టులు కార్డియోథొ రాసిక్ సర్జన్లతో కూడిన 1,200 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులో ఇంట్రాకోరోనరీ ఇమేజింగ్, కాల్షియం మేనేజ్‌మెంట్, టీఏవీఆర్, ఇతర కొత్త ఆవిష్కరణల వంటి వివిధ సెషన్‌లు జరుగనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment