Kadgam Actress Kim Sharma Real Life Story In Telugu - Sakshi
Sakshi News home page

Kim Sharma Then And Now: యువరాజ్‌తో ప్రేమ.. బిజినెస్‌ మ్యాన్‌తో పెళ్లి

Published Sun, Aug 29 2021 8:26 PM | Last Updated on Mon, Aug 30 2021 4:02 PM

Actress Kim Sharma Marriage And Real Life Story In Telugu - Sakshi

Kadgam Actress Kim Sharma Life Story: ‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్‌ శర్మ గుర్తుంది కదా.. తన గ్లామర్ తో కుర్రాల మనసుల మీది ముసుగు లాగేసిందీ ఈ బోల్డ్‌ బ్యూటీ. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’మగధీర (స్పెషల్‌ సాంగ్‌) వంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్‌ భామ.. ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.



బాలీవుడ్‌ మూవీ డర్‌(1993)లో అతిథి పాత్రతో వెండితెరకు పరిచయం అయింది కిమ్‌ శర్మ. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు బాలీవుడ్‌ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ .. 2002లో ఖడ్గం సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కిమ్‌ శర్మ. ఆ తర్వాత మగధీర సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి మెప్పించింది. 
(చదవండి: హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా)

యువరాజ్‌ ప్రేమాయణం.. బిజినెస్‌ మ్యాన్‌తో వివాహం
ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది ఈ భామ. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది.

2010లో బిజినెస్‌ టైకూన్‌ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్‌ శర్మ భర్తతోపాటు కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో అతనితో విడాకులు తీసుకొని తిరిగి ముంబై వచ్చేసింది. విడాకులు తీసుకునే సమయంలో ఆమె మాజీ ప్రియుడు యువరాజ్‌ సింగ్‌ కిమ్‌ కెన్యాకు వెళ్లడం

గమనార్హం. అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ, హర్షవర్థన్ రాణేల డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. 

లియాండర్ పేస్‌తో డేటింగ్‌!
ప్రస్తుతం ఈ  బ్యూటీ  టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్‌తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లిన ఫోటోలు కూడా మీడియాకు చిక్కాయి. అయితే వీరిద్దరు  కలిసి తిరుగుతున్నారు కానీ.. వారి డేటింగ్ విషయమై ఇంతవరకు నోరు విప్పలేదు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కిమ్‌.. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement