కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన వాళ్లని కూడా గుర్తుపట్టలేకపోతుంటాం. వాళ్లు గెటప్ మార్చడం దీనికి కారణం అయ్యిండొచ్చు. ఇప్పుడు అలానే ఓ తెలుగు స్టార్ యాంకర్ డిఫరెంట్ లుక్‌తో కనిపించింది. తొలుత ఈమె ఎవరా అనుకున్నారు. అసలు విషయం తెలిసి రిలాక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ గెటప్ సంగతేంటి?
పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె యాంకర్ అనసూయ. కాకపోతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ యోధురాల్ని గుర్తుచేసుకుంది. ఆమె వేషధారణలోకి మారిపోయింది. అసలు ఆమె ఎవరో ఏంటో కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. '1857 కాలం నాటి స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆవాదీ క్వీన్ బేగం హజ్రత్ మహల్.. దేశం కోసం పోరాడినందుకు 1984 మే10న ప్రభుత్వం ఆమె ఫొటోతో ఓ స్టాంప్ విడుదల చేసింది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకుందాం' అని అనసూయ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)
1857లో బ్రిటీషర్స్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని కోట్లాది మంది భారతీయులు అమరులయ్యారు. అయితే ఈ ఉద్యమంలో మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరే బేగం హజ్రత్ మహల్. తన ధైర్య సాహసాలతో అవధ్ విముక్తి కోసం పోరాటం చేసిన మహాయోధురాలు. అందుకే ఈమెని అభినవ లక్ష‍్మీబాయి అని అంటుంటారు. అలాంటి గెటప్‌లో ఇప్పుడు అనసూయ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
అయితే మిగతా వాళ్లు ఎవరు చేసినా నెటిజన్స్ పెద్దగా పట్టింకునేవారు కాదేమో. ఇక్కుడున్నది అనసూయ కావడంతో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో ట్రెండింగ్‌లో ఉండే ఈ హాట్ యాంకర్.. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధురాలి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలా ఉండే ఈమె ఎలా మారిపోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!)
Comments
Please login to add a commentAdd a comment