నాగర్‌కర్నూల్ టౌన్, న్యూస్‌లైన్: మహిళలపై లైంగికదాడులను అరికట్టేందుకు ప్రభుత్వ నిర్భయ చట్టం తీసుకొచ్చినా...వారికి రక్షణ లేకుండాపోతోందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ మండల ఎండబెట్లలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న కుర్మయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. మంగళవారం కుర్మయ్య దంపతులు ఊరికి వెళ్లడంతో అన్న స్వామితో పాటు బాలిక (16) గుడిసెలోనే నిద్రించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం (21), ఉమాపతి(21), దేవరాజు(22) అనే ముగ్గురు యువకులు పీకల దాకా మద్యం సేవించి, గుడిసెలోకి చొరబబడి నిద్రిస్తున్న బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, గుడిసె సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సావుహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
దీంంతో ఆబాలిక వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో గుడిసెలో నిద్రిస్తున్న ఆమె అన్న స్వామి మేల్కొని అక్కడికి చేరుకున్నాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందుతులు ముగ్గురు కలిసి అతనిపై దాడి చేసి ముళ్లపొదల్లోకి నెట్టివేశారు. దీంతో వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో మేలుకున్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోగా వారిని చూసిన నిందితులు అక్కడినుంచి పరారయ్యారు.
దీంతో గ్రామస్తులు వారిని వెంబడించి శ్రీశైలం, ఉమాపతిలను పట్టుకుని చితకబాది నాగర్‌కర్నూలు పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు దేవరాజు పరారయ్యాడు. కాగా నిందితుల్లోఒకడైన ఉమాపతిపై గతంలో ఒక కేసులో శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి చిన్న కుర్మయ్య ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.
బాలికపై సామూహిక లైంగిక దాడి
Published Thu, Oct 17 2013 3:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement