young boys
-
మంత్రి కాన్వాయ్ అడ్డుకుని మందుబాబులు రచ్చ..
-
Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్(మేడ్చల్): ఓ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుష్రబి జిలానిషేక్ (17), బిస్బిల్లాబి జిలాని షేక్ (16), అశ్మాబి అజీం (19) ముగ్గురు బిహార్ నుంచి వలస వచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో నివాసముంటున్నారు. దేవరయావంజాల్‌లోని ఓ బుక్ కంపెనీలో కార్మికురాలుగా పని చేస్తున్నారు. కాగా ఎప్పటిలాగే ముగ్గురు శనివారం ఉదయం 8 గంటలకు కంపెనీకి వెళ్లారు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటే అదే కంపెనీలో పని చేస్తున్న విష్ణు, నూతన్, విశ్వకర్మలు సైతం పనులను హాజరుకాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) -
జిమ్ చేస్తూ యువకుడి మృతి
హైదరాబాద్: సరైన శిక్షణ లేకుండా జిమ్ చేస్తూ కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోమవారం ఎస్ఆర్నగర్లోని గోల్డెన్ జిమ్‌లో ఆదిత్య (30) అనే యువకుడు జిమ్ చేసిన అనంతరం అస్వస్థతకులోనై మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌కు చెందిన ఆదిత్య బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న గోల్డెన్ జిమ్‌లో ప్రతిరోజు ఉదయం కసరత్తులు చేసేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన ఆదిత్య గంటపాటు ఎప్పటిలాగే జిమ్ చేశాడు. ఆ తర్వాత కడుపులో నలతగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని నిర్వాహకులతో చెప్పి కుప్పకూలిపోయాడు. అయితే ఆదిత్యను నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆదిత్య స్నేహితుడు హుసేన్‌కు వారు ఫోన్ చేయగా హుసేన్ ఆదిత్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆదిత్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ జిమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మాత్రలు వేసుకున్నానని చెప్పాడు ‘ఆదిత్యకు ఉదయం ఫోన్ చేస్తే తీయలేదు. దీంతో అతడిని తీసుకువచ్చేందుకు జిమ్‌కు వెళ్లాను, అప్పటికే ఆదిత్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంటికి తెచ్చాక పరిస్థితి విషమంగా మారడంతో ‘జిమ్‌లో ఏమైనా తిన్నావా’అని అడిగాను. జీఎంజీ మాత్ర వేసుకున్నానని ఆదిత్య చెప్పడంతో జిమ్ ట్రైనర్ అఖిల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాను. ఆయన సలహా మేరకు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను’అని స్నేహితుడు హుసేన్ తెలిపాడు. అయితే జిమ్ చేసేముందు మాత్రలు వేసుకున్నాడా లేక అస్వస్థతకు గురైన అనంతరం మాత్ర వేశారా అన్నది తెలియాల్సి ఉంది. -
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
మేడ్చల్ : మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్‌లో మంగళవారం విషాదం నెలకొంది. మల్కా చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులను బెంగళూరుకు చెందిన నవాజ్ (20), ఆలీ (18)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వివాహ వేడుక కోసం బెంగళూరు నుంచి డబిల్‌పూర్‌కు సోమవారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఆ గడ్డ నేరాలకు అడ్డా..!
► నేర సామ్రాజ్యం వైపు అడుగులేస్తున్న చిన్న ముంబై యువకులు ► హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదం షరామామూలే ► తరచూ అరాచకాలకు పాల్పడుతున్న కిరాయి మూకలు ► రోజురోజుకూ దిగజారుతున్న పోలీసు ప్రతిష్ట చిన్న ముంబైగా పేరొందిన చీరాలలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. సుమారు 400 ఏళ్ల క్రితం ఏర్పడిన చీరాల నేడు జిల్లాలోనే నేరాలకు నిలయంగా..ఘోరాలకు అడ్డాగా మారింది. హత్యలు, హత్యాయత్నాలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదాలు నిత్య కృత్యమయ్యాయి. నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ కళ్లప్పగించి చూస్తోంది. పోలీసు అధికారులైతే అవినీతి మరకలంటించుకుని ఖాకీ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు. దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికవరీల సంగతి గాలికొదిలేశారు. – చీరాల చీరాల: ఒకప్పుడు జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాత్రమే ప్యాక్షన్, కిరాయి హత్యలు జరిగేవి. ప్రస్తుతం అది ఒంగోలు నుంచి చీరాలకు మారింది. గడచిన మూడు నెలల్లో చీరాల నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి. పాత కక్షలు నేపథ్యంలో మూడు నెలల క్రితం రౌడీ షీటర్ కత్తి శ్రీను సైకిల్‌పై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా పాత ప్రసాద్ థియేటర్ సమీపంలోని బోసు నగర్లో అతని సమీప బంధువులు క్రికెట్ బ్యాట్లతో తలపై మోది హత్య చేశారు. నెల క్రితం వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో మరో హత్య జరిగింది. పెరుగు శ్రీనివాసరావుకు చెందిన రొయ్యల చెరువుల వద్దకు గుంటూరు జిల్లాకు చెందిన రాజు పోతురాజురెడ్డి తన భార్యతో కలిసి కాపలాగా వచ్చాడు. పోతురాజు రెడ్డి భార్యతో చెరువుల యజమాని వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. విషయం రెడ్డికి తెలిసి భార్యను మందలించాడు. చివరకు రెడ్డిని మరోవ్యక్తి సాయంతో కొట్టి చంపేశారు. వారం క్రితం వేటపాలెం మండలం పాత పందిళ్లపల్లికి చెందిన రొయ్యల సాగు చేసే తిరుమల శ్రీహరిని అతని సొంత బావ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చీరాలలో కిరాయి హంతక ముఠాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చంపేందుకు కొందరు సుఫారీలు తీసుకుంటున్నారు. చెన్నంబొట్ల అగ్రహరంలో ట్రిపుల్ మర్డర్ నిందితునులను హత మార్చేందుకు ఓ ముఠా సుఫారీ తీసుకుంది. నగదు పంచుకునే విషయంలో విభేదాలు ఏర్పడి ముఠా సభ్యులే ఒకరినొకరు హత మార్చుకునేందుకు సిద్ధమై చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. జోరుగా జూదం పేదలు అధికంగా జీవించే చీరాలలో జూదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. చేనేతలు అధికంగా నివసించే జాండ్రపేట, దేశాయిపేట, ఈపురుపాలెం, పేరాల ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల అధారంగా జరిగే జూదంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికంగా నష్టపోయి అప్పులు పాలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల్లో కూడా చీరాల ఆరితేరింది. ఇటీవల వరసుగా అంతర్జాతీయ క్రికెట్ పోటీల సందర్భంగా చీరాలలో బెట్టింగ్ జోరుగా సాగింది. విద్యార్థులే బెట్టింగ్‌లకు బలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఏడాదిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మసకబారిన పోలీసు ప్రతిష్ట గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు ప్రతిష్ట మసకబారింది. సబ్ డివిజన్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు అవినీతి మరకలంటించుకున్నారు. బచ్చులవారిపాలెంలో జరిగిన ఓ హత్య కేసులో కేసు నమోదు చేయనందుకు ఓ ఎస్ఐ, సీఐ శాఖాపరమైన విచారణ ఎదుర్కొని చివరకు సస్పెండయ్యారు. సీఐ స్థాయి అధికారి వాడరేవులో పోలీసు అతిథి గృహం పేరుతో లక్షల రూపాయల నిధులు సేకరించి అభాసుపాలై సస్పెండయ్యాడు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలంటూ వ్యాపారులు, వైద్యశాలలు, కళాశాలల వద్ద భారీగా నిధులు సేకరించి అక్రమాలకు పాల్పడడంతో సీనియర్ సీఐ ఇటీవలే సస్పెండయ్యారు. కొత్తపేటలోని టూటౌన్ పోలీసుస్టేషన్లో ఓ మహిళను అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చి ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె స్టేషన్çపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయంలో అక్కడ విధులు నిర్వర్తించే ఎస్ఐ, సీఐ సస్పెండ్‌కు గురయ్యారు. నో రికవరీలు ఇటీవల దొంగలు చీరాల ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసుస్టేషన్‌కు కూత వేటు దూరంలోని షాపులు, మద్యం దుకాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఓ బనియన్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దూరిన దొంగలు విలువైన దుస్తులు, కొంత నగదు అపహరించారు. డీజీకె పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలోకి అర్ధరాత్రి చొరబడిన దొంగలు విలువైన మద్యం బాటిళ్లతో పాటు రూ..50 వేలకు పైగా నగదు అపహరించారు. సాల్మన్ సెంటర్లో ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 20 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, కొంత నగదు దోచుకెళ్లారు. ఇలాంటి ఎన్నో చోరీ కేసుల్లో పోలీసులు సవర బంగారాన్ని కూడా రికవరీ చేయలేకపోయారు. -
వీడు మామూలు మాయాగాడు కాదు!
వయస్సు నిండా 19 ఏళ్లు లేదు. కానీ 80 మంది అబ్బాయిలకు ఉచ్చు బిగించాడు. అమ్మాయిల ఫొటోలతో నకిలీ ఖాతాలు తెరిచి.. అబ్బాయిలకు ఎరవేశాడు. మొదట వాళ్లకు రెచ్చగొట్టే అమ్మాయిల ఫొటోలు పంపించాడు. తీరా వాళ్లు లైన్లోకి రాగానే.. నగ్నంగా ఫొటోలు పంపించమని కోరాడు. అలా ఫొటోలు పంపించాక.. ఆన్లైన్ సెక్స్ చర్యలకు పాల్పడ్డాడు. ఇలా టీనేజ్ అబ్బాయిలు తన గుప్పిట్లోకి రాగానే, వారి ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. వారిని వేధించి ఆనందించాడు. ఇలా 80 టీనేజ్ అబ్బాయిలను బోల్తాకొట్టించిన బ్రిటన్ స్కూల్ విద్యార్థి థామస్ ప్రిసి (19) తాజాగా కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరించాడు. ఫేస్బుక్ వేదికగా గత ఐదేళ్లుగా అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకొని.. 80 మందికి పైగా అతడు వేధించాడు. అతడి వేధింపుల ఉచ్చులో కొడుకు చిక్కుకోవడాన్ని గమనించిన ఓ బాధితుడి తల్లి పోలీసులకు సమాచారం అందిచండంతో థామస్ బండారం బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెస్ట్ మిడ్స్లోని హియర్ఫోర్డ్లోని అతని ఇంట్లో థామస్‌ను అరెస్టు చేశారు. మొత్తం తనపై మోపిన 29 అభియోగాలను థామస్ బిర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టులో అంగీకరించాడు. అతనికి మే 13న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. టీనేజ్ అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు రిక్వెస్ట్ పంపించి థామస్ వారిని వలలో వేసుకునేవాడని, ఆ తర్వాత వారి నగ్న ఫొటోలు పంపమని అడిగేవాడని పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద పెద్ద సంఖ్యలో బాధితుల వీడియో రికార్డింగ్‌లు దొరికాయి. ఓ బాధిత బాలుడి తల్లి 2013 సెప్టెంబర్‌లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ గుట్టు రట్టయింది. స్మిత్ పేరిట తన కొడుకుకు ఫేస్బుక్లో ఓ రిక్వెస్ట్ వచ్చిందని, ఆ ఖాతా నుంచి కొన్ని అభ్యంతరకరమైన అమ్మాయి ఫొటోలు రావడమే కాకుండా.. అలాంటి ఫొటోలు పంపించాలని కోరిందని, ఆ ఫొటోలు పంపించిన తర్వాత తాను చెప్పినట్టు వినకుంటే వాటిని బహిర్గతం చేస్తానని తన కొడుకుకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు విచారణలో వెల్లడైన విషయాలు తెలుసుకొని బిత్తరపోయాడు. థామస్ ఒక్కడే అమ్మాయిల పేరిట పలు ఖాతాలు తెరిచి 80మందికిపైగా అబ్బాయిలను వలలో వేసుకున్నట్టు గుర్తించారు. అతని కంప్యూటర్ నుంచి అనేక 'ఫేక్ అమ్మాయిల' ఖాతాలు ఏర్పడినట్టు విచారణలో తెలుసుకున్నారు. -
సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు
హైదారబాద్: విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు యవకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతయిన వారిని అరట్లకోటకు చెందినవారిగా గుర్తించారు. యవకుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. స్థానిక మత్స్యకారులే సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టి ఆ తర్వాత ఆపేశారని బాధిత కుటుంబాలు తెలిపాయి. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
నాగర్‌కర్నూల్ టౌన్, న్యూస్‌లైన్: మహిళలపై లైంగికదాడులను అరికట్టేందుకు ప్రభుత్వ నిర్భయ చట్టం తీసుకొచ్చినా...వారికి రక్షణ లేకుండాపోతోందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ మండల ఎండబెట్లలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న కుర్మయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. మంగళవారం కుర్మయ్య దంపతులు ఊరికి వెళ్లడంతో అన్న స్వామితో పాటు బాలిక (16) గుడిసెలోనే నిద్రించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం (21), ఉమాపతి(21), దేవరాజు(22) అనే ముగ్గురు యువకులు పీకల దాకా మద్యం సేవించి, గుడిసెలోకి చొరబబడి నిద్రిస్తున్న బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, గుడిసె సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సావుహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంంతో ఆబాలిక వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో గుడిసెలో నిద్రిస్తున్న ఆమె అన్న స్వామి మేల్కొని అక్కడికి చేరుకున్నాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందుతులు ముగ్గురు కలిసి అతనిపై దాడి చేసి ముళ్లపొదల్లోకి నెట్టివేశారు. దీంతో వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో మేలుకున్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోగా వారిని చూసిన నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. దీంతో గ్రామస్తులు వారిని వెంబడించి శ్రీశైలం, ఉమాపతిలను పట్టుకుని చితకబాది నాగర్‌కర్నూలు పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు దేవరాజు పరారయ్యాడు. కాగా నిందితుల్లోఒకడైన ఉమాపతిపై గతంలో ఒక కేసులో శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి చిన్న కుర్మయ్య ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.