వీడు మామూలు మాయాగాడు కాదు!
వయస్సు నిండా 19 ఏళ్లు లేదు. కానీ 80 మంది అబ్బాయిలకు ఉచ్చు బిగించాడు. అమ్మాయిల ఫొటోలతో నకిలీ ఖాతాలు తెరిచి.. అబ్బాయిలకు ఎరవేశాడు. మొదట వాళ్లకు రెచ్చగొట్టే అమ్మాయిల ఫొటోలు పంపించాడు. తీరా వాళ్లు లైన్‌లోకి రాగానే.. నగ్నంగా ఫొటోలు పంపించమని కోరాడు. అలా ఫొటోలు పంపించాక.. ఆన్‌లైన్ సెక్స్ చర్యలకు పాల్పడ్డాడు. ఇలా టీనేజ్ అబ్బాయిలు తన గుప్పిట్లోకి రాగానే, వారి ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. వారిని వేధించి ఆనందించాడు.
ఇలా 80 టీనేజ్ అబ్బాయిలను బోల్తాకొట్టించిన బ్రిటన్ స్కూల్ విద్యార్థి థామస్ ప్రిసి (19) తాజాగా కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరించాడు. ఫేస్‌బుక్ వేదికగా గత ఐదేళ్లుగా అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకొని.. 80 మందికి పైగా అతడు వేధించాడు. అతడి వేధింపుల ఉచ్చులో కొడుకు చిక్కుకోవడాన్ని గమనించిన ఓ బాధితుడి తల్లి పోలీసులకు సమాచారం అందిచండంతో థామస్ బండారం బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెస్ట్ మిడ్స్‌లోని హియర్‌ఫోర్డ్‌లోని అతని ఇంట్లో థామస్‌ను అరెస్టు చేశారు. మొత్తం తనపై మోపిన 29 అభియోగాలను థామస్ బిర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టులో అంగీకరించాడు. అతనికి మే 13న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
టీనేజ్ అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు రిక్వెస్ట్ పంపించి థామస్ వారిని వలలో వేసుకునేవాడని, ఆ తర్వాత వారి నగ్న ఫొటోలు పంపమని అడిగేవాడని పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద పెద్ద సంఖ్యలో బాధితుల వీడియో రికార్డింగ్‌లు దొరికాయి. ఓ బాధిత బాలుడి తల్లి 2013 సెప్టెంబర్‌లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ గుట్టు రట్టయింది. స్మిత్ పేరిట తన కొడుకుకు ఫేస్‌బుక్‌లో ఓ రిక్వెస్ట్ వచ్చిందని, ఆ ఖాతా నుంచి కొన్ని అభ్యంతరకరమైన అమ్మాయి ఫొటోలు రావడమే కాకుండా.. అలాంటి ఫొటోలు పంపించాలని కోరిందని, ఆ ఫొటోలు పంపించిన తర్వాత తాను చెప్పినట్టు వినకుంటే వాటిని బహిర్గతం చేస్తానని తన కొడుకుకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు విచారణలో వెల్లడైన విషయాలు తెలుసుకొని బిత్తరపోయాడు. థామస్ ఒక్కడే అమ్మాయిల పేరిట పలు ఖాతాలు తెరిచి 80మందికిపైగా అబ్బాయిలను వలలో వేసుకున్నట్టు గుర్తించారు. అతని కంప్యూటర్ నుంచి అనేక 'ఫేక్ అమ్మాయిల' ఖాతాలు ఏర్పడినట్టు విచారణలో తెలుసుకున్నారు.