చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి | 2 young boys drowned in malka pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

Published Tue, Sep 12 2017 3:42 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

2 young boys drowned in malka pond

మేడ్చల్ : మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్‌లో మంగళవారం విషాదం నెలకొంది. మల్కా చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులను బెంగళూరుకు చెందిన నవాజ్ (20), ఆలీ (18)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వివాహ వేడుక కోసం బెంగళూరు నుంచి డబిల్‌పూర్‌కు సోమవారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement