పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నటుడు | Kannada film actor chetan allegedly attacked by cop, seeks action | Sakshi
Sakshi News home page

పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నటుడు

Published Sat, Jan 31 2015 12:05 PM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నటుడు

పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నటుడు

అర్ధరాత్రి బయటకు వెళ్లి... లాఠీ దెబ్బలతో తిరిగొచ్చాడు శాండల్‌వుడ్ నటుడు చేతన్. మిడ్‌నైట్ 1.45కు చర్చ్‌స్ట్రీట్‌లోని తన మిత్రులను కలిసి తిరిగొస్తుండగా... ఆపిన పోలీసులు పంచ్‌లతో పిచ్చెక్కిచ్చారట. కారణం చెప్పకుండానే... కారు ఆపేసీ... కీ లాగేసుకుని... ఆపై ఫటఫటా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడట లోకల్ ఎస్‌ఐ.

ఇంతలో అక్కడికి చేరుకున్న ఏసీపీ కూడా ఎస్‌ఐని ఫాలో అయిపోయాడట. గుద్దులు కాక... ఇద్దరూ కలసి బూతులూ తిట్టి... వదిలేశారట. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకు వెళితే... సదురు ఎస్‌ఐ అక్కడికీ వచ్చి మళ్లీ పంచ్‌లిచ్చి లాకప్‌లో పెట్టాడట. బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన చేతన్... తన బాధను నగర పోలీస్ కమిషనర్ ముందు మొరపెట్టుకున్నాడట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement