అపాయంలో ఉపాయం | Going Home Short Film.. | Sakshi
Sakshi News home page

అపాయంలో ఉపాయం

Published Mon, Oct 27 2014 12:04 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

అపాయంలో ఉపాయం - Sakshi

అపాయంలో ఉపాయం

అందమైన యువతి, అర్ధరాత్రి, పైగా ఒంటరి.. ఇంతలో కారు పాడైపోయింది.. ఈ టైంలో కొందరు మగాళ్లు కంటపడ్డారు.. ఈ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి తనను తాను ఎలా కాపాడుకుందో చూపించింది గోయింగ్ హోమ్ షార్ట్ ఫిల్మ్. వోగ్ ఎంపవర్ సోషల్ అవేర్‌నెస్ ఇనీషియేటివ్‌లో భాగంగా రూపొందిన గోయింగ్ హోమ్ షార్ట్ ఫిలిం చక్కటి ఆలోచనకు రూపం. ఈ షార్ట్ ఫిలింసిటీప్లస్ ఒక క్లిష్టమైన సందర్భాన్ని, సున్నితంగా హ్యాండిల్ చేసే అవకాశం గురించి అంతర్లీనంగా చెబుతుంది.
 
ఇంట్లోంచి బయల్దేరిన అమ్మాయి మళ్లీ క్షేమంగా ఇంటికి చేరే వరకూ టెన్షనే. అర ్ధరాత్రి కారో, బస్సో పాడయితే ఎవరో ఒకరు సాయం చేయకపోతారా, ఇంటికి చేరే దారే ఉండకపోదా అనే నమ్మకం అమ్మాయిలను నడిపిస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఊహించే ఆ పరిస్థితి వుందా, లేదా అనే చర్చ ఎలా ఉన్నా, ఆడవాళ్లు కోరుకుంటున్న ఆ చక్కటి వాతావరణాన్ని 5 నిమిషాల షార్ట్‌ఫిలింగా మలిచారు దర్శకులు విశాల్‌భ ట్.
 
ఆలియా భట్ నటించిన ఈ వీడియో ఇప్పుడు  యూట్యూబ్‌లో సంచలనంగా  మారింది. గోయింగ్ హోమ్ టైటిల్‌తో రూపొందిన ఈ బుల్లి చిత్రాన్ని ఇప్పటికే 27 లక్షల మంది చూశారు. రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న ఆలియాభట్ కారు మధ్యలో చెడిపోతుంది. ఆ సమయంలో సహాయం కోసం చూస్తున్న ఆమెను ఒక వాహనం సమీపిస్తుంది. అందులో ఐదుగురు మగవాళ్లు. వారి నుంచి ఆ సమయంలో ఆమె కేవలం సహాయం పొంది, జాగ్రత్తగా ఇంటికి ఎలా చేరిందని ఈ చిత్రంలో చూపించారు.  అయితే చూపించిన తీరు మాత్రం ఆలోచనాత్మకంగా సాగుతుంది. ఒక అమ్మాయి ఊహల్లో ఉన్న ప్రపంచాన్నిక్రియేట్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నతో ఈ చిత్రం ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement