వారాంతం కావడంతో మందుబాబులకు చెక్‌పెట్టేందుకు నగర పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 76 కేసుల నమోదు చేయగా.. 32 కార్లు , 44 బైకులను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి మాత్రం నానా హంగామా సృష్టించింది.