Woman hulchul
-
పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్.. నడిరోడ్డుపై బైఠాయించి..
-
పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్.. నడిరోడ్డుపై బైఠాయించి..
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్చల్ చేసింది. పంజాగుట్ట వైపు నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే రహదారిపై బైఠాయించి హంగామా సృష్టించింది. రోడ్డుపై బైఠాయించడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకతో మరింత రెచ్చిపోయిన యువతి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను కింద పడేసింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ముందుగా మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో యువతిని తరలించడం కష్టతరం మారింది. చివరికి మహిళ కానిస్టేబుల్ సహాయంతో యువతిని పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: మాదాపూర్‌లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్ జామ్.. తీరా చూస్తే.. -
డ్రంక్ అండ్ డ్రవ్ టెస్ట్‌లో యువతి బీభత్సం : ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : వారాంతం కావడంతో మందుబాబులకు చెక్‌పెట్టేందుకు నగర పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 76 కేసులు నమోదు చేయగా.. 32 కార్లు, 44 బైకులను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి మాత్రం నానా హంగామా సృష్టించింది. యువతి రాష్ డ్రైవింగ్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ యువతి హ్యుందయ్ క్రెట కారులో (టీఎస్ 09 ఈయూ 9450) అటుగా వచ్చింది. బ్రీత్ ఎనలైజర్‌తో మద్యం సేవించిందో లేదో తనిఖీచేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న హోండా సిటీ కారును ఢీకొట్టి వేగంగా డ్రైవింగ్ చేస్తూ పరారయ్యేందుకు చూసింది. ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అవటంతో సదరు యువతి పోలీసులకు దొరికిపోయింది. మద్యం సేవించిందేమోననే ఉద్దేశంతో మరోసారి తనిఖీ చేయగా ఆల్కాహాల్ శాతం జీరో వచ్చింది. దీంతో యువతి పైన రాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేసి కారును సీజ్ చేశారు. బీభత్సం సృష్టించిన కారు : బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ వైపు నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న కారు మసీదు మలుపు వద్ద అతివేగంతో దూసుకొచ్చింది. భయాందోళనకు గురైన వాహనదారులు, బాటసారులు ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. కారు రోడ్డు మధ్య నున్న డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు తుక్కుతుక్కైంది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
హైదరాబాద్‌లో అర్థరాత్రి యువతి హల్చల్
-
దుర్గ గుడి వద్ద కత్తితో మహిళ హల్చల్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి మహా మండపం వద్ద కత్తి పట్టుకుని ఓ మహిళ హల్చల్ చేసింది. మతిస్థిమితం లేని ఓ గుర్తుతెలియని మహిళ మూడు రోజులుగా మహా మండపం పరిసరాల్లో తిరుగుతున్నట్లు శానిటరీ సిబ్బంది పేర్కొన్నారు. అయితే బుధవారం ఆ మహిళ ప్రవర్తనలో తీవ్ర మార్పు రావడమే కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని దూషించడం ప్రారంభించింది. క్యూలైన్ మెట్లపై కూర్చొన్న భక్తులను తిడుతుండటంతో వారు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళ మానసిక స్థితి సరిగా లేదని గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే మహిళను అక్కడ నుంచి దూరంగా తరలించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. మహిళ వద్ద ఉన్న మూడు బ్యాగులను పరిశీలించగా చాకు కనిపించింది. దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవరావు అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న భాస్కరరావుకు విషయం చెప్పడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మహిళ వల్ల భక్తులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భావనతో వెంటనే ఆమెను ఆటోలో దేవస్థానానికి దూరంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళను ఆటోలో తరలిస్తుండగా కూడా ఆలయ సిబ్బందిని దూషిస్తూనే ఉంది. -
ఆలయంలో కిలాడి లేడి హల్చల్
-
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్
తిరుపతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్ చేసింది. టీలో మత్తుమందు కలిపి మహిళా భక్తులకు విక్రయించింది. ఆ టీ తాగి మహిళలు స్పృహతప్పి పడిపోయారు. దాంతో సదరు మహిళల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుంది. ఆ విషయాన్ని గమనించిన ఆలయంలోని భక్తులు వెంటనే స్పందించి కిలాడీ లేడిని పట్టుకుని దేహశుద్ది చేసి... ఆలయ భద్రత సిబ్బందికి అప్పగించారు. దీంతో ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని...కేసు నమోదు చేశారు. స్పృహ కోల్పోయిన మహిళలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.