
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్‌చల్ చేసింది. పంజాగుట్ట వైపు నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే రహదారిపై బైఠాయించి హంగామా సృష్టించింది. రోడ్డుపై బైఠాయించడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకతో మరింత రెచ్చిపోయిన యువతి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను కింద పడేసింది.
పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ముందుగా మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో యువతిని తరలించడం కష్టతరం మారింది. చివరికి మహిళ కానిస్టేబుల్ సహాయంతో యువతిని పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చదవండి: మాదాపూర్‌లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్ జామ్.. తీరా చూస్తే..