అమెరికాలోని మిసిసిపీలో ఒక సంచలన ఉదంతం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడిని పోలీసులు జైలుకు తరలించారు. తన తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేయడమే ఆ చిన్నారి చేసిన తప్పిదం. దీనిపై ఆ చిన్నారి తల్లి న్యాయం పోరాటం చేసేందుకు సన్నద్దురాలైంది. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, దీంతో తన పిల్లాడు బెంబేలెత్తిపోయాడని ఆమె ఆరోపించింది.
‘జనాలు ఉండే చోట కారు వెనుక ఎందుకు మూత్ర విసర్జన చేశావని’ ఆ బాలుడిని మీడియా ప్రశ్నించగా తన తల్లి, సోదరి ఆ సమయంలో.. ‘దగ్గరలో ఎటువంటి బాత్రూమ్‌లు లేవు.. నువ్వు కారు వెనక మూత్ర విసర్జన కానిచ్చేయమని’ తెలిపారన్నాడు. అయితే ఆ సమయంలో దీనిని చూసిన ఒక అధికారి ఆ పిల్లాడిని మందలించి, విడిచిపెట్టబోతున్నంతలో పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ పిల్లాడిని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా ఆ ప్లిలాడి తల్లి ఇజోన్ మాట్లాడుతూ తన కుమారుడు పార్కింగ్ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేయడం సరైనది కాదంటూనే, ఇంత చిన్న విషయానికే పోలీసులు పిల్లాడిని లాక్కుపోవడం దారుణమన్నారు. పదేళ్ల పిల్లాడిని పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించింది. తన కుమారుడు పోలీసులను చూసి భయపడిపోయాడని, వారు జైలుకు తరలిస్తుంటే పెద్దపెట్టున రోదించాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కొద్దిసేపటి తరువాత పోలీసులు ఆ బాలుడిని తల్లితో పాటు పంపించేశారు.
సెంటోబియా పోలీస్ చీఫ్ రిచర్డ్ చాండ్లర్ మాట్లాడుతూ యూఎస్ యూత్ కోర్ట్ చట్టంలోని వివరాలు తెలిపారు. ఏడేళ్లలోపు పిల్లల విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమన్నారు. 10 ఏళ్ల పిల్లలు చట్టవిరుద్ధంగా ఏదైనా చేస్తే, చట్టాన్ని అమలు చేసేవారు దానిని ప్రభుత్వానికి నివేదించవచ్చని వివరించారు. ఇటువంటి కేసుల నుంచి పిల్లలను మినహాయించడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చాండ్లర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య!
Comments
Please login to add a commentAdd a comment