
రేలీ: అమెరికాలోని నార్త్ కరోలినా రాజధాని రేలీలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూస్ రివర్ గ్రీన్‌వేలో నివాస ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిపై ఒక బాలుడు(15)తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యాడు. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఓ ఇంట్లో దాక్కున్న బాలుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment