మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది.
డానియెల్ హారిస్ అనే 29 ఏళ్ల చెవిటి వ్యక్తిని భద్రతాసిబ్బంది కాల్చిచంపడంపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. అంతర్రాష్ట్ర హైవేపై వాహనంలో వేగంగా వెళుతున్న హారిస్ ను ఓ భద్రతా జవాను వెంబడించాడు. హారిస్ చార్లెట్ లోని తన ఇంటికి సమీపంలోకి వచ్చిన వాహనాన్ని నిలిపేసి కిందకు దిగాడు. అక్కడ జవానుతో జరిగిన వాగ్వాదం అనంతరం జవాను అతన్ని కాల్చిచంపినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే, చెవిటి వ్యక్తిని కనికరం లేకుండా జవాను కాల్చిచంపడంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది.
చెవిటివాడన్న కనికరం కూడా లేకుండా!
Published Tue, Aug 23 2016 11:41 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement
Advertisement