నార్త్‌కెరోలినా : దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ’యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మళయాళ మెగా స్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. వైఎస్సార్‌సీపీ రాలీ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంతో ఆర్భాటంగా జరిగింది.
యాత్ర సినిమా శ్రేయోభిలాషులు, వైఎస్‌ఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు హాజరైన ఈ ఈవెంట్‌లో ఆయన చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలు, అంకురార్పణం చేసిన పధకాల గురించి వివరించారు. భారతదేశంలో జరుగుతున్న ‘యాత్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హజరు కాలేక పోతున్నామన్న వెలితిని ఇక్కడ ప్రవాస ఆంధ్రులు తమ శైలిలో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసి తమ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డా|| వై ఎస్ రాజశేఖర్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు యాత్ర టీషర్ట్స్ వేసుకుని తమ వంతు ఉడతా భక్తిని తెలియజేసారు. అభిమానులందరు జై వైఎస్‌ఆ ర్‍జై జగన్‌అని నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఈరోజే (ఫిబ్రవరి 8) విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని చోట్లా సందడి వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment