
అల్లరికి భయపడి... పిల్లలకు నో ఎంట్రీ!
ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్.. నార్త్ కరోలినాలోని మూరెస్‌విల్లీలో ఉండే ఈ రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతోకిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి ఈ రెస్టారెంట్ ఇటీవల ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఐదేళ్ల చిన్నారులను అనుమతించకపోవడం.. ఈ కఠిననిర్ణయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయం తర్వాత వ్యాపారం మరింత అభివృద్ధి అయిందని ఆ రెస్టారెంట్ యజమాని నెటిజన్ల విమర్శలను కొట్టిపారేస్తున్నాడు.
అసలు సంగతేంటంటే.. రెస్టారెంట్‌లోకి తల్లిదండ్రులు చిన్నపిల్లలను తీసుకురావడం.. అక్కడ వాళ్ల అల్లరి మితిమీరిపోవడం.. తద్వారా పక్కవారికి చాలా డిస్ట్రబ్ అవడం క్రమంగా జరుగుతోందట! కొన్నిసార్లు వాళ్ల అల్లరి శృతిమించి తోటి కస్టమర్లు యజమానికి ఫిర్యాదులు కూడా చేశారంటా.. దీంతో చేసేదేమీ లేక రెస్టారెంట్ యజమాని తాను నష్టపోయినా ఫర్వాలేదు... రెస్టారెంట్‌కున్న మంచి పేరు చెడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తన రెస్టారెంట్‌లో అనుమతి లేదని బోర్డు పెట్టేశాడు. అయితే విభిన్నంగా అప్పటినుంచి రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారుల సంఖ్య మరింత పెరగడంతో తాను తీసుకున్న నిర్ణయం పొరపాటేమీ కాదని సదరు యజమాని సంబరపడిపోతున్నాడు.