కలలో భార్యను చంపేశాడు.. కానీ! | US man tells 911 he thinks he killed his wife in dream | Sakshi
Sakshi News home page

కలలో భార్యను చంపేశాడు.. కానీ!

Published Tue, Sep 5 2017 3:21 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

కలలో భార్యను చంపేశాడు.. కానీ!

కలలో భార్యను చంపేశాడు.. కానీ!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చాలా విచిత్రంగా తన భార్యను హత్య చేశాడు. అయితే తాను మాత్రం కలలో భార్యను హత్య చేసి ఉండొచ్చునంటూ కథలు అల్లాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా.. నార్త్ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్ కు గతేడాది నవంబర్‌లో లారేన్ ఫెల్ప్స్‌ (29)తో వివాహం జరిగింది. గత శుక్రవారం అర్ధారత్రి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసిన జేమ్స్.. తన భార్యను హత్య చేసినట్లుగా అనిపిస్తుందని అక్కడికి రావాలని దాదాపు ఆరు నిమిషాలు ఫోన్‌లో మాట్లాడాడు.

 అనంతరం ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులతో పాటు పోలీసులు అక్కడికి వచ్చి లారెన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం జేమ్స్‌ను అరెస్ట్ చేసి వేక్ కౌంటీ జైలులో హాజరు పరిచారు. పోలీసుల విచారణలో జేమ్స్ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. దగ్గు సమస్యతో ఉన్న తాను కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయానని కొన్ని గంటల తర్వాత మెలకువ వచ్చి లైట్ ఆన్ చేసినట్లు చెప్పాడు. బెడ్ మీద రక్తపు మరకులున్నాయని, పక్కనే కత్తి ఉందని, తన భార్య లారేన్ రక్తపు మడుగులో పడి ఉందని విచారణలో వెల్లడించాడు.

భార్య అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెను హత్య చేయాల్సిన అవసరం లేదన్నాడు. టాబ్లెట్ డోస్ ఎక్కువైందని, దాని ప్రభావం వల్ల తనకు తెలియకుండా కలలోనే భార్యను హత్య చేసి ఉండొచ్చునని, ఇదే విషయాన్ని ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేసి చెప్పినట్లు వివరించాడు. ఉద్దేశపూర్వకంగా భార్యను హత్యచేసి జేమ్స్ కట్టుకథలు చెబుతున్నాడని పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement