ఓ సరదా సన్నివేశం.. ఒక్కక్షణం భయపడి.. ఆ తర్వాత ‘హమ్మయ్య’ అనుకుంటున్నారు చూసిన నెటిజన్లంతా. సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన కుటుంబానికి ఆ సన్నివేశం సరదా జ్ఞాపకాన్ని మిగిల్చింది. అట్లాంటిక్ సముద్రంలోని ‘కెప్‌కాడ్ బే’ వద్ద ఫాంక్లిన్‌కు చెందిన డఫ్ నెల్సన్ చేపలు పడుతుండగా.. తెల్లటి భారీ సొరచేప అతన్ని భయబ్రాంతులకు గురిచేసింది. అయితే సొరచేప పైకి వచ్చి వారి పడవపైకి దూకడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న అతని కుమారుడు చేపను చూసి ఉలిక్కిపడి వెనక్కు పరుగెత్తాడు. దీంతో వారంతా హమ్మయ్య అనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను అతను తన ట్విట్టర్‌లో జులై 21న ‘అంట్లాంటిక్ వైట్ షార్క్ కన్సర్వేన్సీ’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 76వేల లైక్‌లు రాగా ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ‘థ్యాంక్ గాడ్.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ షాక్ నుంచి తేరుకున్న డాఫ్ నెల్సన్ ‘సొరచేప మాకు మర్చిపోలేని సరదా జ్ఞాపకాన్ని ఇచ్చిందంటూ’ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment