First Ever Full Sized Scans Reveal Titanic Wreck Never Seen Before, Details Inside - Sakshi
Sakshi News home page

Titanic 3D Scan Images: వేల అడుగుల లోతుల్లో టైటానిక్‌ ఓడ.. ఆ చిత్రాలను మీరూ చూసేయండి

Published Thu, May 18 2023 5:01 PM | Last Updated on Thu, May 18 2023 5:39 PM

Full sized scans reveal Titanic Wreck never seen before - Sakshi

టైటానిక్‌.. ఈ పేరు వినగానే జేమ్స్‌ డైరెక్షన్‌లో వచ్చిన అద్భుత ప్రేమకావ్యం.. ఆ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలామందికి గుర్తొ‍స్తుంటుంది. కానీ, వాస్తవంగా జరిగిన ఘోర ప్రమాదం.. అత్యంత భారీ విషాదమని గుర్తు చేసుకునేవాళ్లు చాలా కొద్దిమందే!.  

చరిత్రలో ఘోర ప్రమాదాలు గురించి పేజీలు తిప్పితే.. టైటానిక్‌కు కూడా అందులో చోటు ఉంటుంది. సినిమాగా తెర మీదకు వచ్చేదాకా ప్రపంచానికి పెద్దగా ఆసక్తిక కలిగించని ఈ ఓడ ప్రమాదం.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అదీ ఎందుకో మీరే లుక్కేయండి.. 

అట్లాంటిక్‌ మహాసముద్రంలో.. దాదాపు 13వేల అడుగుల లోతున కూరుకుపోయిన మోస్ట్‌ ఫేమస్‌ టైటానిక్‌ శకలాలను చూస్తారా?.. అదీ డిజిటల్‌ స్కాన్‌లో ఫుల్‌ సైజులో.

తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా  డీప్‌ సీ మ్యాపింగ్‌ను ఉపయోగించి త్రీడీ స్కాన్‌ చేశారు టైటానిక్‌ శకలాలను.

అట్లాంటిక్‌ అడుగునకు ప్రత్యేక నౌక ద్వారా ఓ జలంతర్గామిని పంపించి..  సుమారు 200 గంటలపాటు శ్రమించి 7,00,000 చిత్రాలను తీసి స్కాన్‌ను రూపొందించారు. ఈ క్రమంలో శకలాలను ఏమాత్రం తాకకుండా జాగ్రత్త పడ్డారట. 

1912లో జరిగిన టైటానిక్‌ ఘోర ప్రమాదంలో.. 1,500 మంది మరణించారు.  లగ్జరీ ఓడగా సౌతాంప్టన్‌(ఇంగ్లండ్‌) నుంచి న్యూయార్క్‌కు తొలి ట్రిప్‌గా వెళ్తున్నటైటానిక్‌ ఓడ.. మార్గం మధ్యలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐస్‌ బర్గ్‌ను ఢీ కొట్టి నీట మునిగింది. 

1985లో కెనడా తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్‌లో వేల అడుగుల లోతున టైటానిక్‌కు సంబంధించిన శకలాలను తొలిసారి గుర్తించారు.  కానీ, ఇన్నేళ్లలో ఆ శకలాల పూర్థిస్తాయి చిత్రాలను మాత్రం ఏ కెమెరాలు క్లిక్‌ మనిపించలేకపోయాయి. 

తాజాగా.. కొత్తగా తీసిన స్కాన్‌లో టైటానిక్‌ శకలాలకు సంబంధించిన పూర్తి స్థాయి దృశ్యాలు బయటపడ్డాయి. రెండుగా విడిపోయిన ఓడ భాగాలు.. ఇందులో కనిపిస్తున్నాయి. 

త్రీడీ రీకన్‌స్ట్రక్షన్‌ ద్వారా ప్రతీ యాంగిల్‌లో ఏడులక్షల ఇమేజ్‌లను తీశారు.  2022 సమ్మర్‌లోనే డీప్‌-సీ మ్యాపింగ్‌ కంపెనీ అయిన మాగెల్లాన్ లిమిటెడ్ ఈ స్కాన్‌ను నిర్వహించగా.. అట్లాంటిక్‌ ప్రొడక్షన్స్‌ వాళ్లు దానిని డాక్యుమెంటరీగా ఓ ప్రాజెక్టు రిలీజ్‌ చేసింది. 

నీట మునిగిన టైటానిక్‌.. దానిని శకలాల త్రీడీ స్కాన్‌ ఫుల్‌ సైజ్‌ చిత్రాలను బుధవారం ప్రచురించింది ఓ ప్రముఖ మీడియా సంస్థ. 

ఈప్రమాదానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించాల్సి ఉంది అని ఏళ్ల తరబడి టైటానిక్‌పై పరిశోధనలు చేస్తున్న విశ్లేషకుడు పార్క్స్‌ ​ స్టీఫెన్‌సన్‌ అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement