Titanic ship
-
అందులో అలా... ఇప్పుడు ఇలా
సముద్రగర్భంలో టైటానిక్ శిథిలాలను చూడడానికి ‘టైటాన్’ అనే జలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురు సాహసికుల ప్రయాణం విషాదాంతం అయిన నేపథ్యంలో యానిమేటెడ్ సిట్కాం ‘ది సింప్సన్’ లోని చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం... 2006లో వచ్చిన ‘ది సింప్సన్’ సీజన్ 17లోని పదో ఎపిసోడ్లో హీరో హోమర్ సింప్సన్ తన తండ్రి మాసన్‌తో కలిసి జలాంతర్గామిలో సముద్రగర్భంలోకి వెళతాడు. ఒకచోట నిధులతో కూడిన శిథిలమైన నావ కనిపిస్తుంది. ఆ తరువాత వీరి జలాంతర్గామి పగడపు దిబ్బల మధ్యలో చిక్కుకు పోతుంది. మరోవైపు జలాంతర్గామిలో ‘లో ఆక్సిజన్’ సైన్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తండ్రీకొడుకులు బయటపడతారు. ‘ది సింప్సన్స్’లోని తండ్రీకొడుకులు మాసన్, హోమర్ సింప్సన్లను, టైటాన్లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షెహ్జాదా దావూద్, సులేమాన్ దావూద్లతో పోల్చి నెటిజనులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ది సింప్సన్’ రచయిత మైక్ రీస్ టైటానిక్ శిథిలాలను చూడడానికి గత సంవత్సరం భార్యతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లివచ్చాడు. వారు ప్రయాణించిన జలాంతర్గామిలో కొద్ది సమయం పాటు కమ్యూనికేషన్ సమస్యలు వచ్చినా ఆ తరువాత సర్దుకుంది. -
టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు..
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ (జలాంతర్గామి) మంగళవారం గల్లంతయ్యింది. అయిదుగురితో బయల్దేరిన జలంతర్గామి అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ప్రముఖ పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త, అతని కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పిపోయిన వారిలో మరో ప్రయాణికుడిని బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్‌గా గుర్తించారు. కరాచీ ప్రధాన కార్యాలయం కలిగిన ఎంగ్రో కార్పొరేషన్ వైస్ చైర్మన్ షాజాదా దావూద్‌తోపాటు అతని కుమారుడు సులేమాన్ సముద్రంలో తప్పిపోయిన ఓడలో ఉన్నారని వారి కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. సబ్ మెరైన్ క్రాఫ్ట్తో సంబంధాలు తెగిపోయాయని వీటిని పునరుద్ధరించేందుకు, మిస్ అయిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి పలు సంస్థలు, డీప్-సీ కంపెనీలు సంయుక్తంగా రెస్క్యూ ప్రయత్నం జరుపుతున్నాయని తెలిపింది. వారి క్షేమం కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఎంగ్రో అనే సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. చదవండి: అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. అయితే మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దీంతో తప్పిపోయిన సబ్‌మెరైన్ కోసం.. అమెరికా, కెనడాకు చెందిన కోస్ట్‌గార్డ్, రక్షణ బృందాలు అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. టైటానిక్ మునిగిపోయిన కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్లు (650 కిలోమీటర్లు)దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భారీ నౌక టైటానిక్ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటిక్ సముద్రం దిగువన 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో గుర్తించారు. ఈ షిక్ శకలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్న జలాంతర్గామిని వినియోగిస్తోంది. దీని ద్వారా సముద్రం అడుగుకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూసి రావొచ్చు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. -
మళ్లీ వార్తల్లోకెక్కిన టైటానిక్ ఓడ
టైటానిక్.. ఈ పేరు వినగానే జేమ్స్ డైరెక్షన్లో వచ్చిన అద్భుత ప్రేమకావ్యం.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలామందికి గుర్తొస్తుంటుంది. కానీ, వాస్తవంగా జరిగిన ఘోర ప్రమాదం.. అత్యంత భారీ విషాదమని గుర్తు చేసుకునేవాళ్లు చాలా కొద్దిమందే!. చరిత్రలో ఘోర ప్రమాదాలు గురించి పేజీలు తిప్పితే.. టైటానిక్‌కు కూడా అందులో చోటు ఉంటుంది. సినిమాగా తెర మీదకు వచ్చేదాకా ప్రపంచానికి పెద్దగా ఆసక్తిక కలిగించని ఈ ఓడ ప్రమాదం.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అదీ ఎందుకో మీరే లుక్కేయండి.. అట్లాంటిక్ మహాసముద్రంలో.. దాదాపు 13వేల అడుగుల లోతున కూరుకుపోయిన మోస్ట్ ఫేమస్ టైటానిక్ శకలాలను చూస్తారా?.. అదీ డిజిటల్ స్కాన్‌లో ఫుల్ సైజులో. తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా డీప్ సీ మ్యాపింగ్‌ను ఉపయోగించి త్రీడీ స్కాన్ చేశారు టైటానిక్ శకలాలను. అట్లాంటిక్ అడుగునకు ప్రత్యేక నౌక ద్వారా ఓ జలంతర్గామిని పంపించి.. సుమారు 200 గంటలపాటు శ్రమించి 7,00,000 చిత్రాలను తీసి స్కాన్‌ను రూపొందించారు. ఈ క్రమంలో శకలాలను ఏమాత్రం తాకకుండా జాగ్రత్త పడ్డారట. 1912లో జరిగిన టైటానిక్ ఘోర ప్రమాదంలో.. 1,500 మంది మరణించారు. లగ్జరీ ఓడగా సౌతాంప్టన్(ఇంగ్లండ్) నుంచి న్యూయార్క్‌కు తొలి ట్రిప్‌గా వెళ్తున్నటైటానిక్ ఓడ.. మార్గం మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్ బర్గ్‌ను ఢీ కొట్టి నీట మునిగింది. 1985లో కెనడా తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్‌లో వేల అడుగుల లోతున టైటానిక్‌కు సంబంధించిన శకలాలను తొలిసారి గుర్తించారు. కానీ, ఇన్నేళ్లలో ఆ శకలాల పూర్థిస్తాయి చిత్రాలను మాత్రం ఏ కెమెరాలు క్లిక్ మనిపించలేకపోయాయి. తాజాగా.. కొత్తగా తీసిన స్కాన్‌లో టైటానిక్ శకలాలకు సంబంధించిన పూర్తి స్థాయి దృశ్యాలు బయటపడ్డాయి. రెండుగా విడిపోయిన ఓడ భాగాలు.. ఇందులో కనిపిస్తున్నాయి. త్రీడీ రీకన్స్ట్రక్షన్ ద్వారా ప్రతీ యాంగిల్లో ఏడులక్షల ఇమేజ్‌లను తీశారు. 2022 సమ్మర్లోనే డీప్-సీ మ్యాపింగ్ కంపెనీ అయిన మాగెల్లాన్ లిమిటెడ్ ఈ స్కాన్‌ను నిర్వహించగా.. అట్లాంటిక్ ప్రొడక్షన్స్ వాళ్లు దానిని డాక్యుమెంటరీగా ఓ ప్రాజెక్టు రిలీజ్ చేసింది. నీట మునిగిన టైటానిక్.. దానిని శకలాల త్రీడీ స్కాన్ ఫుల్ సైజ్ చిత్రాలను బుధవారం ప్రచురించింది ఓ ప్రముఖ మీడియా సంస్థ. ఈప్రమాదానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించాల్సి ఉంది అని ఏళ్ల తరబడి టైటానిక్‌పై పరిశోధనలు చేస్తున్న విశ్లేషకుడు పార్క్స్ స్టీఫెన్సన్ అంటున్నారు. -
టైటానిక్ ఓడను చూడాలనుకుంటున్నారా.. టికెట్ రూ.కోటి 87 లక్షలే
ఒకప్పుడు అంటే... 1912లో టైటానిక్ షిప్ ఫస్ట్ క్లాస్ టికెట్ ఖరీదు... మూడువేల రూపాయలు. ఇప్పుడు శిధిలావస్థలో సముద్రపు అడుగుభాగంలో ఉన్న అదేషిప్ను చూసేందుకు టికెట్ ఖరీదు అక్షరాలా కోటి 87లక్షలు. చదవండి: ‘టైటానిక్’ మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత.. టైటానిక్ సినిమా చూసిన ఎవ్వరికైనా... ఒక్కసారి ఆ ఓడ ఎక్కాలనిపిస్తుంది. ఆసక్తి ఉంటే... మునిగిపోయిన ఆ టైటానిక్ షిప్‌నే చూపిస్తామని ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్ సంస్థ చెబుతోంది. 1912లో మునిగిపోయి సముద్రంలో 12,500 అడుగుల లోతుకు వెళ్లిపోయిన ఆ షిప్‌ను చూసేందుకు ఓషన్‌గేట్ గతేడాది నుంచి టూర్స్ ఏర్పాటు చేస్తోంది. డిస్కవరీ, నేషనల్ జాగ్రఫీలను మించిన ఆ అద్భుతమైన అనుభూతి సొంతం చేసుకోవాలనుకుంటే... వేసవిలో మే నుంచి జూన్వరకు యాత్రకు వెళ్లొచ్చు. 110 ఏండ్ల కిందట మునిగిన ఈ షిప్‌ను ఇప్పటిదాకా 200 మంది మాత్రమే చూశారు. చదవండి: అఫ్గానిస్తాన్: ఆకలి చావులు, ఆర్థిక సంక్షోభంతో పొత్తిళ్లలోనే పెళ్లిళ్లు! ప్రయాణం సాగుతుందిలా... ఈ మిషన్ కాలం ఎనిమిది రోజులు. కెనడా, న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెంట్ జాన్స్ నుంచి టైటానిక్ శిథిలాలున్న చోటు 600 కిలోమీటర్లు. అక్కడ నుంచి... నాలుగు కిలోమీటర్ల లోతు సబ్మెర్సిబుల్లో ప్రయాణించి ఆ షిప్‌ను చేరుకుంటారు. షిప్‌ను చేరేందుకు సముద్రంలోపల దాదాపు ఎనిమిది నుంచి పది గంటలపాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్మెర్సిబుల్లో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా శిథిలమైన ఈ షిప్ ఇంకో 40 ఏళ్లలో మొత్తం నామరూపాల్లేకుండా పోవచ్చని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
టైటానిక్ అసలు కథ ఇదే..
అత్యంత విలాసవంతమైన భారీనౌక అది. ఎంతో మందిని తమతమ గమ్యస్థానాలనకు చేర్చేందుకు బయలుదేరింది. పడవలో... విందులు, వినోదాలు, కోలాహలంతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సరైన సమాచారం.. సరైన చోటుకి పంపినప్పటికీ అది చేరాల్సిన చోటుకి అందలేదు. ఇక అంతే ఒక్కసారిగా అల్లకల్లోలం రేగింది. ఎంతోమంది ప్రాణాలను మూటగట్టుకుని వెళ్లిపోయింది. అదేనండీ.. టైటానిక్ పడవ ప్రమాదం అని మీకిప్పటికే అర్థమైపోయిందనుకుంటా. టైటానిక్ పడవ తన మొదటి ప్రయాణంలోనే విషాదం చోటుచేసుకుంది. అ సంఘటన జరిగి గతవారమే 106 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మరిన్ని విషయాలను తెలుసుకుందాం...! 1912 ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత, సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు జాడలేడు. ఆకాశం నిర్మలంగా ఉంది. మంచు కొండల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న కెప్టెన్ స్మిత్ నౌకను దక్షిణం దిశగా మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు... టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు సైతం కంట్రోల్ రూమ్‌కి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం)లో ప్రయాణిస్తోంది. నౌక ముందు పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడెరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ పెద్ద మంచు పర్వతాన్ని గుర్తించారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపు మళ్లించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగిపోయి మళ్లీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. అయినప్పటికీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం నివారించలేకపోయారు. ఈ ఘటనలో నౌక కుడిభాగం వైపు 300 అడుగుల పొడవు మేర రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్ల(అతికించడానికి వేసే నట్లవంటి నిర్మాణాలు)ను పెకిలించింది. కంపార్ట్మెంటుల్లోకీ చేరిన నీరు నౌక ముందుభాగం దెబ్బతినడంతో మెల్లిగా పడవలోకి నీరు చేరడం మొదలైంది. నాలుగు కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలిఉంది. కానీ ఐదో కంపార్ట్మెంట్లోకి కూడా నీరుచేరడం ప్రారంభమైంది. క్రమక్రమంగా పడవలోని పైన ఉండే కంపార్ట్ మెంట్లలోనూ నీరు చేరడం మొదలైంది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్, ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని ఆదేశించారు. మొదటి లైఫ్ బోటు 12 మంది ప్రయాణికులతో కిందికి దించారు. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది, ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. ఇతర నౌకలకు సమాచారం అందించినా... వైర్లెస్ ఆపరేటర్లు జాక్ ఫిలిప్స్, హరాల్డ్ బ్రైడ్ ప్రమాద విషయాన్ని సమీప నౌకలకు చేరవేసాడు. ’’మౌంట్ టెంపుల్’’, ’’ఫ్రాంక్ఫర్ట్’’, టైటానిక్ సోదర నౌక ’’ఒలంపిక్’’ నౌకలకు సమాచారం అందింది. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. 58 మైళ్ల దూరంలో ఉన్న కునార్డ్ లైన్స్‌కి చెందిన కర్పతియా నౌక ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 2224 మంది నౌకలో ఉండగా 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనికారణంగా ఆ నౌక భారీగా అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది. విలాసవంతమైన నౌక టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం ఐర్లాండు లోని బెల్ఫాస్టు్క చెందిన హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1909లో అమెరికాకు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమై మార్చి 31, 1912కి పూర్తయింది. ఇది 269 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉండేది. ప్రయాణికులు నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3,547 మందిని మోయగలదు. నౌకలోనే ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, రెండు తరగతుల ప్రయాణికులకు గ్రంధాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది. నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. – సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
ఆ చివరి లైఫ్‌బోట్..
టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు.. నేనున్నానంటూ పలువురి ప్రాణాలకు భరోసా కల్పిస్తూ.. నౌకలోని చివరి లైఫ్‌బోట్ తన ప్రయాణాన్ని సాగించింది.. మరేమైంది.. మాట నిలబెట్టుకుందా? టైటానిక్‌లాగే మునిగిపోయిందా? మే 13, 1912.. టైటానిక్ విషాదం జరిగి దాదాపు నెల రోజులు.. ప్రమాద స్థలానికి సరిగ్గా 200 మైళ్ల దూరం.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆర్ఎంఎస్ ఓషియానిక్ నౌక నెమ్మదిగా ప్రయాణం సాగిస్తోంది.. అల్లంత దూరంలో సముద్రంలో సగం మునిగి తేలుతున్నట్లు పడవలాంటిది కనిపించింది.. అదేంటో పరిశోధించడానికి ఓషియానిక్ నుంచి కొందరు బయల్దేరారు.. అప్పుడు కనిపించింది వీరికా చివరి లైఫ్‌బోట్.. తనతోపాటు ముగ్గురు అభాగ్యుల మృతదేహాల్ని మోస్తూ.. ఇంతకీ ఈ మధ్యలో ఏం జరిగింది? టైటానిక్ నుంచి పదుల సంఖ్యలో ప్రయాణికులను మోసుకుని బయల్దేరిన ఈ చివరి లైఫ్ బోట్‌కు కూడా టైటానిక్‌కు పట్టిన గతే పట్టిందని తేలింది. బయల్దేరిన కొద్దిసేపటికే.. టైటానిక్‌లాగే ఇది కూడా ఓ మంచు కొండను ఢీకొంది. పలువురు సముద్రంలో మునిగిపోయారు. షిప్‌నకు చెందిన ఇద్దరు ఫైర్మన్లు, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు థాంప్సన్ మృతదేహాలను మాత్రం మోస్తూ.. ఇదలాగే ఉండిపోయింది. బాగా కుళ్లిపోయిన మృతదేహాలు ఓషియానిక్ సిబ్బందికి బోటు అడుగుభాగంలో కనిపించాయి. ఈ చివరి లైఫ్‌బోట్ కు సంబంధించిన అరుదైన చిత్రాలు, మొత్తం ఆపరేషన్‌ను వివరిస్తూ రాసిన పత్రం తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీన్ని ఈ శనివారం బ్రిటన్‌లోని విల్ట్‌షైర్‌లో వేలం వేయనున్నారు. భారీగా ధర పలుకుతుందని అంచనా. -
టైటానిక్ ఢీకొన్న పర్వతానికి లక్ష ఏళ్లు
లండన్: అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైన మంచు పర్వతం (ఐస్‌బర్గ్) లక్ష ఏళ్ల నాటి దని శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు. మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాం ట్ బిగ్ ‘టైటానిక్’ ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు సండేటైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు. -
రూ. 88 లక్షలు పలికిన మెనూ కార్డు
న్యూయార్క్: 'టైటానిక్' లంచ్ మెనూ కార్డు ఒకటి భారీ ధరకు అమ్ముడు పోయింది. లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో దాదాపు రూ. 88 లక్షలు పలికింది. ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడం విశేషం. టైటానిక్ ఓడలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన అబ్రహం లింకన్ సాల్మన్ అనే వ్యక్తి దీన్ని భద్రపరిచాడని లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ తెలిపింది. దీనిపై 1912, ఏప్రిల్ 14 తేదీ స్టాంపుతోపాటు వైట్ స్టార్ లినె లోగో ఉంది. గ్రిల్లెడ్ మటన్ చాప్స్, కస్టర్డ్ పుడ్డింగ్, కార్నెడ్ బీఫ్, బ్యాకెడ్ జాకెట్ పొటాటోస్, బఫెట్ ఆఫ్ ఫిష్, హామ్ అండ్ బీఫ్, యాపిల్ పెస్ట్రీతో పాటు 8 రకాల చీజ్ ఐటెమ్స్ వివరాలు మెనూలో ఉన్నాయి. 3 లేదా 4 టైటానిక్ మెనూ కార్డులు మాత్రమే ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. టైటానిక్ ప్రమాదం నుంచి బయట పడిన వారు వీటిని భద్రపరిచారు. అట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయింది. 1912, ఏప్రిల్ 15న జరిగిన ఈ దుర్ఘటనలో 1500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. -
గల్లంతైన విమానం కోసం ... 'టైటానిక్' విజ్ఞానం
ఎంహెచ్ 370 మలేసియా విమానం గల్లంతై 50 రోజుల దాటి పోయింది... అయినా ఇంతవరకు ఆ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆ విమాన ఆచూకీ కోసం గతంలో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఆచూకీ కోసం ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ జానస్టన్ బుధవారం వెల్లడించారు. ఆ అంశంపై ఇప్పటికే మలేసియా, చైనా, యూఎస్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రెండు ప్రపంచ యుద్ద సమయంలో టైటానిక్ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో నౌకలోని 1500 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆ నౌక ఆచూకీ కోసం అన్వేషణలు తీవ్రంగా సాగిన చిట్ట చివరకు 1985 అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల అడుగున టైటానిక్‌ను కనుగొన్న విషయం విదితమే. 227 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బందితో గతనెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి ఎంహెచ్ 370 విమానం బీజింగ్ బయలుదేరింది. అయితే ఆ విమానం బయలుదేరిన కొన్ని గంటలకు విమానాశ్రయంలోని ఏటీసీ కేంద్రంలో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ఆచూకీ కోసం ఇప్పటికే పలు దేశాలు విమానాలు, నౌకలు, శాటిలైట్ల ద్వారా సముద్రంలో జల్లెడ పట్టి గాలించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో టైటానిక్ కోసం వినియోగించిన విజ్ఞానం ద్వారా అయిన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ తెలుస్తుందని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఆ విమాన ప్రయాణికులలో ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్
1912లో మంచు దిబ్బను ఢీకొని మునిగిన టైటానిక్ నౌక నుంచి వెలికితీసిన వయోలిన్ ఇది. నౌక సముద్రంలో మునిగేటపుడు భయాందోళనలతో ఉన్న ప్రయాణికులను శాంత పరిచేందుకు బ్యాండ్‌మాస్టర్ వాలస్ హార్ట్లీ దీన్ని వాయించాడని ప్రతీతి. ఇంతటి అరుదైన వయోలిన్ శనివారం సౌత్‌వెస్ట్ ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్ కౌంటీలో నిర్వహించిన వేలంపాటలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది. టైటానిక్ నుంచి బయటపడిన వస్తువుల్లో అత్యధిక ధర పలికింది ఈ వయోలినే కావడం విశేషం.