మియామి : ఆధునిక ప్రపంచంలో ఒక్క క్షణం కరెంట్ పోతే? జనజీవనం స్థంభించి పోతుంది అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. నేడు ప్రపంచమంతా విద్యుత్ చుట్టే తిరుగుతోంది. విద్యుత్ ఉత్పాదన కోసం ప్రపంచ దేశాలన్నీ విపరీంగా ఖర్చు చేస్తున్నాయి. అన్ని రకాల వనరులను విపియోగించుకుంటున్నాయి. సంప్రదాయి ఇంధన వనరులతో పాటూ, సౌర, పవన, అణు విద్యుత్ ఉత్పాదన వైపు అడుగులు వేస్తున్నాయి. అయినా సరిపడ విద్యుత్ ఉత్పాదనను సాధించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు అమెరికాలోని కార్నెగీ విశ్వవిద్యాలయ సైంటిస్టులు తీపి కబురు అందించారు.
అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర తీరంలో వపన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే.. మొత్తం ప్రపంచానికి సరిపడే విద్యుత్‌ను అందించవచ్చని తాజాగా కార్నెగీ సైంటిస్టులు ప్రకటించారు. అయితే ఇదేమంతా ఆషామాషీగా చేపట్టే ప్రాజెక్ట్ కాదని.. దీనికి అంతర్జాతీయ సహాయసహకారాలు అవసరమవుతాయని సైంటిస్టులు తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో మూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పవన విద్యుత్‌ను ఏర్పాటు చేస్తే.. మొత్తం ప్రపంచానికి అవసరమైన విద్యుత్‌ను అందించవచ్చని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment