Carnegie Mellon University
-
80 శాతం గ్లేసియర్లు... 80 ఏళ్లలో మాయం!
వాషింగ్టన్: భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీ నదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది. ‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు. -
రోబోలతో వైరస్ పని పట్టు
న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులలో రోబోలను ఉపయోగించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనుషులు వెళ్లలేని, వెళ్లకూడని చోట్లకు రోబోలను పంపి విధులు నిర్వర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా సోకిన వారికి మందులు అందించడంతో పాటుగా, ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రోబోలు ఉపయోగపడుతున్నాయి. గతేడాది చివర్లో చైనాలోని వూహాన్లో వైరస్ వెలుగు చూసినపుడు అక్కడి ఆస్పత్రులలో రోబోలనే వాడారు. రోగుల శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు, మందులు అందించేందుకు, రోగి ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేందుకు అవి సహాయపడ్డాయి. రోగి ముక్కు, గొంతు నుంచి టెస్ట్ శాంపిళ్లను సేకరించడానికి రోబోలు ఉపయోగపడతాయని అమెరికాకు చెందిన కార్నిగే మెలాన్ యూనివర్సిటీ నిపుణులు తేల్చారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ ఆస్పత్రిలో అతినీలలోహితక కాంతితో చేసే క్లీనింగ్ పనిని రోబో కేవలం 10నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోబోలు కీలక పాత్ర పోషించగలవని పంజాబ్ లవ్లీ యూనివర్సిటీకి చెందిన డీన్ లోవి రాజ్ గుప్తా తెలిపారు. ‘రోబోలు అన్ని స్థాయిల్లోనూ మానవ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ కాలంలో అవి మరింత ఉపయోగపడగలవు. రోగులకు కావాల్సిన వాటిని అందించగలవు’ అని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం వైద్యులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారికి కరోనా సోకకుండా రోబోలను వినియోగించుకోవచ్చని అదే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అనిత గెహ్లోత్ అన్నారు. మన దేశంలో.. రోగులకు దూరంగా ఉంటూ చికిత్స అందించడంలో రోబోలు భారత వైద్యులకు ఉపకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైద్యులకు చికిత్సతో పాటుగా ఆహారం, మందులు అందించేందుకు హ్యూమనాయిడ్ రోబోలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీ నిపుణులు ఐసోలేషన్‌లోని రోగులకు వైద్యం అందించేందుకు రోబోను తయారు చేశారు. అది రోగి గదిలోకి మందులు, ఆహారాన్ని తీసుకెళ్లగలదు. -
ఇది నిజం : ప్రపంచానికే కరెంట్ ఇద్దాం
మియామి : ఆధునిక ప్రపంచంలో ఒక్క క్షణం కరెంట్ పోతే? జనజీవనం స్థంభించి పోతుంది అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. నేడు ప్రపంచమంతా విద్యుత్ చుట్టే తిరుగుతోంది. విద్యుత్ ఉత్పాదన కోసం ప్రపంచ దేశాలన్నీ విపరీంగా ఖర్చు చేస్తున్నాయి. అన్ని రకాల వనరులను విపియోగించుకుంటున్నాయి. సంప్రదాయి ఇంధన వనరులతో పాటూ, సౌర, పవన, అణు విద్యుత్ ఉత్పాదన వైపు అడుగులు వేస్తున్నాయి. అయినా సరిపడ విద్యుత్ ఉత్పాదనను సాధించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు అమెరికాలోని కార్నెగీ విశ్వవిద్యాలయ సైంటిస్టులు తీపి కబురు అందించారు. అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర తీరంలో వపన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే.. మొత్తం ప్రపంచానికి సరిపడే విద్యుత్‌ను అందించవచ్చని తాజాగా కార్నెగీ సైంటిస్టులు ప్రకటించారు. అయితే ఇదేమంతా ఆషామాషీగా చేపట్టే ప్రాజెక్ట్ కాదని.. దీనికి అంతర్జాతీయ సహాయసహకారాలు అవసరమవుతాయని సైంటిస్టులు తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో మూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పవన విద్యుత్‌ను ఏర్పాటు చేస్తే.. మొత్తం ప్రపంచానికి అవసరమైన విద్యుత్‌ను అందించవచ్చని వారు చెబుతున్నారు. -
చందమామకు బహుమతులు..
వాషింగ్టన్: అందాల చందమామపైకి బహుమతులను తీసుకెళ్లే రోబోను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. భూమిపై నుంచి అతి తక్కువ బరువుతో వీటిని చంద్రమండలంపైకి చేర్చేలా రూపొందిస్తున్నారు. భూమిపై ప్రసిద్ధి గాంచిన కళ, కవిత్వం, సంగీతం, డ్రామా, నృత్యాలను చిన్నపాటి డిస్కుల్లో బంధించి ఓ మూన్ రోవర్‌తో వచ్చే ఏడాదిలో పంపేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సర్వం సిద్ధం చేస్తోంది. అమెరికాలోని కార్నిగె మిలన్ విశ్వవిద్యాలయం, రోబోటిక్స్ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రయివేటు నిధులతో గూగుల్ లునార్ ఎక్స్‌ప్రైజ్, యూఎస్డీ 30 మిలియన్ కాంటెస్ట్‌ను తయారు చేస్తోంది. చంద్రుడిపైకి చిన్నసైజు డిస్కులతోపాటు, డేటా తీసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు టెక్టైమ్స్ తెలిపింది. -
గంట నడిస్తే.. రెండున్నర గంటల చార్జింగ్!
మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అయిందా? అందుబాటులో చార్జ్ చేసుకునే అవకాశం లేదా? ఏం ఫరవాలేదు. ఈ బూట్లు వేసుకుని నడిస్తే చాలు.. మీ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. వీటిని వేసుకుని ఒక గంట నడిస్తే.. రెండున్నర గంటల పాటు ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వీటిని తయారు చేశారు. ఇవెలా పనిచేస్తాయంటే.. బూట్ల కింది సోల్భాగం లోపల చిన్న జనరేటర్, మెకానికల్ వ్యవస్థ ఉంటుంది. నడిచినప్పుడు ఏర్పడే గతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఈ వ్యవస్థ బూటుపైన ఉండే బ్యాటరీకి అనుసంధానమై ఉంటుంది. ఇంకేం.. నడిచినప్పుడు పుట్టే కరెంటు ఎప్పటికప్పుడు ఈ బ్యాటరీలో నిల్వ అవుతుంది. తర్వాత బ్యాటరీని తీసి కేబుల్ ద్వారా ఫోన్‌కు పెట్టుకోవడమే. వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘సోల్పవర్’ కంపెనీ వెల్లడించింది. -
స్మార్ట్ హెడ్లైటుతో ప్రమాదాలకు చెక్!
రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లకు హెడ్లైట్ల వెలుతురు కారణంగా కళ్లు చెదిరిపోవడం వల్లే ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే.. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస నరసింహన్ బృందం సరికొత్త స్మార్ట్ హెడ్‌లైట్‌ను ఆవిష్కరించింది. పది లక్షల సూక్ష్మ కాంతిపుంజాలను విడుదల చేసే ఈ హెడ్‌లైట్.. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తూ కాంతిపుంజాలను నియంత్రించుకుంటుంది. డ్రైవర్ల కళ్లు చెదిరిపోయేంత తీవ్రంగా కాంతి పడకుండా కొన్ని కాంతి పుంజాల విడుదలను ఆపుతుంది. హెడ్‌లైటు నుంచి వెలువడే కాంతి పెద్దగా తగ్గకుండానే.. ఎదుటివారి కళ్లు చెదరకుండా చేస్తుంది. అలాగే వర్షం, మంచు కురుస్తుంటే గనక.. రోడ్డు స్పష్టంగా కనిపించేలా చేయడం కోసం కూడా కాంతిపుంజాలను సరిచేసుకుంటుంది. వాహనంపై అమర్చే ఓ కెమెరా, కంప్యూటర్ సాయంతో ఇది వేగంగా పనిచేస్తుంది. -
ఈ 'బాబు' కోసం ఆ 'బాబు' అంత పని చేశాడా !!