
చందమామకు బహుమతులు..
వాషింగ్టన్: అందాల చందమామపైకి బహుమతులను తీసుకెళ్లే రోబోను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. భూమిపై నుంచి అతి తక్కువ బరువుతో వీటిని చంద్రమండలంపైకి చేర్చేలా రూపొందిస్తున్నారు. భూమిపై ప్రసిద్ధి గాంచిన కళ, కవిత్వం, సంగీతం, డ్రామా, నృత్యాలను చిన్నపాటి డిస్కుల్లో బంధించి ఓ మూన్ రోవర్‌తో వచ్చే ఏడాదిలో పంపేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సర్వం సిద్ధం చేస్తోంది.
అమెరికాలోని కార్నిగె మిలన్ విశ్వవిద్యాలయం, రోబోటిక్స్ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రయివేటు నిధులతో గూగుల్ లునార్ ఎక్స్‌ప్రైజ్, యూఎస్‌డీ 30 మిలియన్ కాంటెస్ట్‌ను తయారు చేస్తోంది. చంద్రుడిపైకి చిన్నసైజు డిస్కులతోపాటు, డేటా తీసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు టెక్‌టైమ్స్ తెలిపింది.