భారత్-మాల్దీవుల మధ్య ఇటీవల చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో మాల్దీవుల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. చైనా పరిశోధక నౌక ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ మాలె తీరానికి చేరినట్లు ధృవీకరిస్తూ మాల్దీవుల ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది రాకపోకలు, భర్తీ కోసం చైనా దౌత్యపరమైన అభ్యర్థన చేసిందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది.
తమతో స్నేహంగా ఉండే పలు దేశాలకు చెందిన నౌకలకు మాల్దీవుల ద్వీపం ఓ గమ్యస్థానమని పేర్కొంది. తాము ఎప్పుడు ఆ దేశాల నౌకలకు స్వాగతం చెబుతామని తెలిపింది. మాల్దీవుల తీరంలోకి తమ దేశం పరిశోధక నౌక వస్తున్నట్లు చైనా సమాచారం అందించిందని మాల్దీవుల విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా తమ దేశ నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి మాల్దీవుల దౌత్యపరమైన అనుమతి తీసుకుందని పేర్కొంది. ఇక.. గతంలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించటంపై భారత్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చైనా అనుకూల వ్యక్తి పేరు ఉందన్న విషయం తెలిసిందే. ఒక వైపు భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో మొయిజ్జు.. చైనా పర్యటించారు. తమ దేశంలోని సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని భారత్‌ను కోరిన విషయం తెలిసిందే.
చైనా పరిశోధక నౌక.. నిఘా సమాచారాన్ని సేకరించే సాధనాలను కలిగి ఉంటుందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి నౌకలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు, గగన తలంపై నిఘా ఉంచగలవని తెలుస్తోంది. అందుకే భారత్.. చైనా నౌకలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది
చదవండి: ఫిబ్రవరి 8న పాక్ ఎన్నికలు...‘బ్యాట్’ పట్టని ఇమ్రాన్!
Comments
Please login to add a commentAdd a comment