
Intresting Facts:
► సంతోషంగా ఉండడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండడానికి భయపడతారు. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే కీడు జరుగుతుందనే మూఢ నమ్మకం. సంతోషంగా ఉండడానికి భయపడే లక్షణాన్ని చెరోఫోబియా అంటారు.
► ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యంలో ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయి.
► ఒక దురలవాటు దూరం కావాలంటే గట్టిగా 21 రోజులు దాని జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందట.
► ‘వోవర్ మారో’ అంటే ఏమిటో కాదు ది డే ఆఫ్టర్ టుమారో(ఎల్లుండి) అని.
► ‘పండిత పుత్ర పరమ శుంఠ’ అనే నానుడి ఇంగ్లిష్ కవి, రచయిత షేక్స్‌పియర్ విషయంలో నిజమేననిపిస్తుంది. షేక్స్‌పియర్ ప్రపంచ ప్రఖ్యాతి పొందినా, ఆయన పిల్లలందరూ నిరక్షరాస్యులే!
► కొందరు కూరగాయలను చూస్తే చాలు విపరీతంగా భయపడతారు. కూరగాయల పట్ల ఉండే ఈ అరుదైన భయాన్ని ‘ల్యాకనోఫోబియా’ అంటారు.
► ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత తెలిసిందే గాని, నిజానికి రొయ్య కొంచెం కూత ఘనం అనడమే సమంజసం. ఎందుకంటారా? ‘పిస్టల్ ష్రింప్’ జాతికి చెందిన రొయ్య మహా అయితే రెండు సెంటీమీటర్లు ఉంటుంది. ఇది చేసే ధ్వని మాత్రం కాంకోర్డ్ విమానాల స్థాయిలో ఉంటుంది. ఇది తన డెక్కలను వేగంగా మూసి తెరవడం ద్వారా 230 డెసిబల్స్ ధ్వనిని పుట్టించగలదు.
► బ్రిటన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎనిమిదో హెన్రీ వద్ద ‘గ్రూమ్స్ ఆఫ్ స్టూల్స్’ పనిచేసేవాళ్లు. వాళ్ల పనేమిటంటే రాజావారు గురుశంక తీర్చుకున్నాక శుభ్రం చేయడం. తన హయాంలో ఈ ఉద్యోగంలో పనిచేసిన నలుగురికీ నైట్‌హుడ్ అనుగ్రహించారు రాజావారు.
► అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌కు బ్రకోలీ అంటే విపరీతమైన అయిష్టం ఉండేది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో బ్రకోలీ పై నిషేధం విధించారు.