
ఈ హైటెక్ హెడ్‌బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు.
ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది.
కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940).