జపాన్‌లోని ఒకునోషిమా దీవి కుందేళ్ల దీవిగా పేరుమోసింది. ఈ దీవిలో మనుషుల కంటే కుందేళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కుందేళ్లు గుంపులు గుంపులుగా గంతులేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ దీవి సాధారణ జనావాసంగానే ఉండేది. వ్యవసాయం సహా అన్ని పనులూ సాగేవి. ఈ దీవిలో కొన్ని మత్స్యకారుల కుటుంబాలు కూడా ఉండేవి.
దీవి రక్షణ కోసం జపాన్ ప్రభుత్వం ఇక్కడ కట్టుదిట్టమైన పది కోటలను నిర్మించింది. తర్వాత రష్యాతో యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జపాన్ సైన్యం 1925లో దీనిని రహస్య పరిశోధన కేంద్రంగా మార్చుకుని, ఇక్కడి జనాలను ఇతర ప్రదేశాలకు తరలించింది. రసాయనిక ఆయుధాల ప్రయోగాలలో భాగంగా ఇక్కడకు కొన్ని కుందేళ్లను తీసుకొచ్చింది.
రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నాళ్లకు జపాన్ సైన్యం కూడా ఈ దీవిని ఖాళీ చేసింది. అయితే, మొదట్లో తీసుకొచ్చిన కుందేళ్లు ఆ తర్వాత అంతకంతకూ వృద్ధి చెంది, ఇది కుందేళ్ల దీవిగా మారింది. ఇక్కడి కుందేళ్లను చూడటానికి పర్యాటకులు తరచు ఇక్కడకు వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment