పెళ్లి అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అందుకే సంబంధం చూసేటప్పుడు ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అయితే బీహార్‌లోని ఓ గ్రామంలో కొన్నేళ్లుగా అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగట్లేదట. మంచి ఉద్యోగాలు చేస్తున్నా ఆ ఊరి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నో అంటున్నారట. ఇంతకీ విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈకాలంలో సంబంధాలు కుదరాలంటే అంత ఈజీ కాదు. ఉద్యోగం,జాతకాలు శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్, వంటివి గట్టిగానే చూస్తున్నారు. ఏ ఒక్కటి మ్యాచ్ కాకపోయినా అమ్మాయిని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. అయితే బీహార్‌లోని జముయి జిల్లా సదర్ నగరానికి దగ్గర్లో ఉన్న 'బరుఅట్టా' అనే గ్రామంలో ఒక్క అమ్మాయికి కూడా పెళ్లి కావడం లేదు.
అసలు ఆ ఊరి అబ్బాయిలకు సంబంధాలు రావడం లేదు. వాళ్లు ఉద్యోగాల కంటే పెళ్లి చేసుకోవడానికే ఎక్కువ కష్టపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. పెళ్లి కుదరడానికి ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటీ కుదరడం లేదట. దీనికి కారణం ఏంటంటే..బారుఅట్ట గ్రామంలో సుమారు 50 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.
అయితే గ్రామంలో రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వర్షాల సమయంలో ప్రాంతమంతా బురదమయంగా మారుతుండటంతో ఆ ఊరి అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు నో చెబుతున్నారట.
Comments
Please login to add a commentAdd a comment