అదిరిపోయే పవర్‌ సూట్‌లో అలియా భట్‌! దాని ఖరీదే ఏకంగా..! | Alia Bhatts Vibrant And Classy Ombre Green Pantsuit | Sakshi
Sakshi News home page

అదిరిపోయే పవర్‌ సూట్‌లో అలియా భట్‌! దాని ఖరీదే ఏకంగా..!

Published Fri, Feb 16 2024 5:17 PM | Last Updated on Fri, Feb 16 2024 6:58 PM

Alia Bhatts Vibrant And Classy Ombre Green Pantsuit  - Sakshi

బాలీవుడ్‌ నటి అలియా భట్‌ ప్యాషన్‌కి ఐకాన్‌లా తనదైన శైలిలో ఉంటుంది. ఏ వేడుకకు తగ్గ ట్రెండీ డ్రస్‌తో అందర్నీ మిస్‌మరైజ్‌ చేస్తుంటుంది. ఎప్పటి కప్పుడూ ఓ ట్రెండీ లుక్‌తో వస్తూ.. సరికొత్త డ్రస్సింగ్‌ స్టయిల్‌ని పరిచేయం చేస్తుంది అలియా. అందుకు నిదర్శనం ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఘటన, అయోధ్య వేడుకలే. జాతీయ అవార్డుల ఫంక్షన్‌ తగ్గట్టుగా హుందాగా స్టన్నింగ్‌ శారీతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత ఇటీవల అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చీరపై రామాయాణ ఇతిహాస చిత్రాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఎప్పడూ కొంగొత్త స్టయిలిష్‌ డ్రస్‌లతో వార్తల్లో నిలుస్తుంటారు అలియా. మళ్లీ ఈ పవర్‌ ఫుల్‌ పవర్‌ సూట్‌తో సరికొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసి హాట్‌టాపిక్‌గా మారారు. ఈ మేరకు అలియా గురువారం తన రాబోయే సిరీస్‌ పోచర్‌ ట్రైలర్‌ లాంచర్‌ కోసం అలియా ఓంబ్రే పవర్‌ సూట్‌ని ధరించారు. ఈ లుక్‌లో ఆమె పవర్‌ ఫుల్‌ విమెన్‌లా ఉంది. అందరీ కళ్లు ఆమె డ్రస్‌ పైనే ఉన్నాయి. ఆ సూట్‌కి తగ్గ హైహిల్స్‌, చెవిపోగులు, లైట్‌ మేకప్‌తో కళ్లు తిప్పుకోలేనంత కలర్‌ఫుల్‌గా కనిపించింది అలియా. ఇంతకీ ఆ సూట్‌ ధర ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆ ఓంబ్రే ప్యాంట్‌ సూట్‌ ధర ఏకంగా రూ. 3.15 లక్షలు/-

(చదవండి: మిస్‌ వరల్డ్‌ 2023 పోటీల్లో భారత్‌ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement