ఎంïసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి
నర్సంపేట : చాయ్‌వాలాగా చెప్పుకొని గద్దెనెక్కిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సూటు, బూటు ఎలా ధరిస్తున్నాడని ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓంకార్ భవన్‌లో ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా జనరల్ బాడీసమావేశం నాగెల్లి కొంరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ పాలన లేదని, మోదీ సామ్రాజ్యవాద దేశాలకు పెట్టుబడిదారులకు నమ్మకమైన పెద్ద ఏజెంట్‌గా పని పనిచేస్తున్నారన్నారు. అందులో భాగమే అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్‌డీఐ నూటికి నూ రు శాతం అనుమతించడమన్నారు.
రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల ఏడు నెలల కాలంలో కొత్తగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సమావేశంలో రూరల్ జిల్లా కార్యదర్శి గాదగోని రవి, గోనె కుమారస్వామి, నాగెల్లి కొంరయ్య, కొత్త కొండ రాజమౌళి, బాపురావు, రవి, హంసారెడ్డి, బుచ్చన్న, మల్లికార్జున్, సుల్తాన్, సారయ్య, లక్ష్మినారాయణ, మాషుక్, సదానందం, మొగిళిచర్ల సందీప్, కొంరయ్య, సాంబయ్య, యాదగిరి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
చాయ్‌వాలాకు సూటు ఎందుకు..?
Published Tue, Jan 3 2017 2:14 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement