ఏం తిప్పావు అంకుల్‌?! | See An Old Man Flaunting A Pink Suit With This Much Swag | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న వృద్ధుడి స్వింగ్‌ మూవ్‌మెంట్‌

Published Wed, Oct 7 2020 6:24 PM | Last Updated on Wed, Oct 7 2020 6:29 PM

See An Old Man Flaunting A Pink Suit With This Much Swag - Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతున్నాయి. అందులో కొన్ని అద్బుతంగా ఉంటే మరి కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి కూడా ఉంటాయి. తాజాగా ఈ కోవకు చేందిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. క్రిస్టియన్‌ డీ హారిస్ అనే వ్యక్తి‌.. ‘నా భార్యతో డేట్‌కి వెళ్లడానికి ముందు నా మోడలింగ్‌ వీడియో’ అంటూ దీన్ని షేర్‌ చేశాడు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో హారిస్‌ పింక్‌ కలర్‌ సూట్‌ ధరించి రూమ్‌లోకి నడుచుకుంటూ వస్తాడు. సూట్‌ లోపల డార్క్‌ పర్పుల్‌ కలర్‌ టై... బ్రౌన్‌ కలర్‌ ఫార్మల్‌ షూ ధరించాడు. ఆ తర్వాత మైక్రోవేవ్‌ స్పిన్‌ డ్యాన్స్‌ స్టెప్‌తో తన సూట్‌ని ప్రదర్శించాడు. (చదవండి: ఈ ‘బనాన గర్ల్‌’  డైటేమిటంటే....)

 ఈ సింపుల్‌ యాక్షన్‌ ట్విట్టర్‌ జనాలకు తెగ నచ్చింది. ఇప్పటికే దీన్ని 38.6కే మంది వీక్షించారు. అంకుల్‌ ఏం తిప్పారు.. నా తల ఇంకా తిరుగుతూనే ఉంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. మీరు ఓ సారి ఈ అంకుల్‌ స్లో మోషన్‌ మోడలింగ్‌ వీడియో చూడండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement