రాహుల్‌పై అరుణ్ జైట్లీ విమర్శలు
Published Thu, May 5 2016 9:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. రాహుల్ గాంధీ సూటు, బూటు పేరుతో ప్రభుత్వంపై ద్వేషం ప్రదర్శిస్తూ బంగారంపై ప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. బంగారు,వజ్రపు ఆభరణాలపై ఒక శాతం పన్ను పెంపునకు నిరసనగా వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు రాహుల్ మద్దతు పలకడాన్ని జైట్లీ తప్పుబట్టారు.
గతంలో ఉన్న పన్నునే తిరిగి పునరుధ్దరించామని, చిన్న వ్యాపారులపై పన్ను విధించలేదని జైట్లీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బంగారు వ్యాపారులపై ప్రేముంటే ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 5 శాతం వ్యాట్ ను ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని జైట్లీ నిలదీశారు. 2012-13లోనే వరుసగా గత ప్రభుత్వం బంగారం దిగుమతులపై 10 శాతం పన్నును విధించిందని అన్నారు. తమ ప్రభుత్వం దేవాలయాల్లో, ఇళ్లలో వృధాగా ఉన్న బంగారాన్ని సమీకరించడానికి కృషి చేస్తోందని జైట్లీ తెలిపారు.
Advertisement