Suit Made of Men's Mustache | Suit Made For Hair Of Human Mustache Is Very Beautiful - Sakshi
Sakshi News home page

మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి!

Dec 12 2021 8:31 AM | Updated on Dec 12 2021 1:13 PM

Suit Made For Hair Of Human Mustache Is Very Beautiful - Sakshi

Suit Made of Men's Mustache: తలపై జుట్టు ఉన్నప్పుడు, చాలా అందంగా కనిపిస్తుంది. అవే వెంట్రుకలు ధరించే దుస్తులపై కనిసిస్తే చాలా ఆసహ్యంగా ఉంటుంది కదూ! కానీ, మొత్తం మీసాల వెంట్రుకలతో తయారైన ఈ సూటు ఎంత అందంగా ఉందో చూడండి! ఫొటోలో ఉన్న ఈ సూట్‌ పేరు ‘పొలిటిక్స్‌ మువెంబర్‌’. నో షేవ్‌ నవంబర్‌లో భాగంగా ఎంతోమంది క్యాన్సర్‌ రోగులకు దానం చేసే వెంట్రుకలను ఉపయోగించి, మెల్‌బోర్న్‌కు చెందిన విజువల్‌ ఆర్టిస్ట్‌ పమేలా క్లీమన్‌ పాస్సీ దీనిని రూపొందించారు.

నిజానికి ఈ రూపకల్పన వెనుక ఓ కథ ఉంది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించకపోవడమే తన భర్త క్యాన్సర్‌తో మరణించడానికి కారణమైందని పమేలా భావించింది. ఆ అవగాహనా కార్యక్రమమేదో తానే మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అలా 2016 నుంచి వివిధ సెలూన్ల నుంచి మీసాల వెంట్రుకలను పోగు చేయసాగింది. రీసైక్లింగ్‌ ద్వారా వీటిని శుభ్రం చేసి, కాటన్‌తో కలిపి నేయించి, ఓ ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌ను తయారుచేసింది.

ఇందుకు ప్రముఖ సంస్థ ‘పొలిటిక్స్‌’ సహకారం అందించడంతో అద్భుతమైన ఈ సూటు రూపొందింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ఎంతోమంది ఆమెకు నేరుగా వెంట్రుకలను పంపిస్తున్నారు. వీటిని ఉపయోగించి మరెన్నో డిజైన్స్‌ను రూపొందించి, మరింత అవగాహన కల్పిస్తానని డిజైనర్‌ పమేలా క్లీమన్‌ పాస్సీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement