ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్‌కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లక్షలు దాటుతున్న యూజర్లు..
నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు.
పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్‌లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు.
(ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..)
— Mark Zuckerberg (@finkd) July 6, 2023
ఎలాన్ మస్క్ స్పందన..
మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్‌బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!)
😂
— Elon Musk (@elonmusk) July 6, 2023
Comments
Please login to add a commentAdd a comment