ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా థ్రెడ్స్' (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
మెటా థ్రెడ్స్ లాగిన్ విధానం..
- ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన కొత్త 'మెటా థ్రెడ్స్' వినియోగించాలనుకునే వ్యక్తి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధారాలను నమోదు చేయండి
- ప్రొఫైల్ ఫోటో, పేరు, బయో, లింక్‌లు వంటి ఇన్‌పుట్ వివరాలు ఫిల్ చేయండి.. లేదా ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకోవచ్చు.
- పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రైవేట్ ప్రొఫైల్ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే మీ పోస్టులు, ఇతర వివరాలు కనిపిస్తాయి.
- చివరగా జాయిన్ థ్రెడ్‌లపై క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.
మెటా థ్రెడ్స్ ఉపయోగాలు..
మెటా థ్రెడ్స్ యాప్ ద్వారా కంటెంట్‌ని సృష్టించవచ్చు, లింక్స్ పెట్టవచ్చు, ఫొటోలు, అయిదు నిమిషాల నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ దాదాపు ట్విటర్ ఫీచర్స్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ట్విటర్‌లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు అప్పటికి ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
(ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!)
మెటా థ్రెడ్స్ యాప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులో వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు 500 అక్షరాలా వరకు పోస్ట్ చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment