ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్
కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్‌షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్‌లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్‌లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్‌ల సంఖ్యను కూడా చూపుతుంది.
ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్!
థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్‌బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment