Threads
-
ఎన్నికల వేళ సోషల్ మీడియా షాక్.. మెటా కీలక నిర్ణయం!
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్ మీడియా దిగ్గజం మెటా ( Meta ) షాకిచ్చింది. పొలిటికల్ కంటెంట్‌ను తమ ఇన్స్టాగ్రామ్ ( Instagram ), థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో రెకమెండ్ చేయబోమని ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్ కంటెంట్‌కి కళ్లెం వేస్తామంటోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్బుక్ మాతృ సంస్థ ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్‌ను రెకమెండ్ చేయబోమని ప్రకటిచింది. అయితే రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించాలకుంటే తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలో కాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా సిఫార్సు మాత్రం చేయబోమని చెప్పింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో రాజకీయ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టం. ఈ మేరకు ఎంపిక చేసుకోవడానికి అనుమతించే సెట్టింగ్‌లను మెటా తీసుకురాబోతోంది. ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్బుక్లో అమలు కానుంది. "రాజకీయ కంటెంట్ కావాలా వద్దా అన్న ఎంపిక యూజర్లకు కల్పించడమే మా లక్ష్యం. అదే సమయంలో ప్రతి ఒక్కరి ఆసక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది" అని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజకీయ నాయకుల సోషల్ మీడియా బలమైన వేదికగా ఉంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే అనువుగా మారింది. వీటిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇకపై ఆయా ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్ అవాంఛితంగా అందిరికీ చేరదు. పొలిటికల్ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్ చేరుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ మెటా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. -
నెలవారీ 10కోట్ల యూజర్లను సంపాదించిన సంస్థ!
మెటా సంస్థలో భాగంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ నెలవారీగా దాదాపు 100 మిలియన్ల(10కోట్లు) వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇటీవల కంపెనీ త్రైమాసిక ఆదాయాల గురించి మాట్లాడుతున్నపుడు ఈ విషయాన్ని చెప్పారు. సానుకూలంగా సంభాషణలు సాగించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ టూల్‌ను తీసుకొచ్చిందన్నారు. ఇన్స్టాథ్రెడ్లు రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని మెటా సీఎఫ్ఓ సుసాన్ లి అన్నారు. ఇన్స్టాగ్రామ్ వార్తలకు వ్యతిరేకం కాదని, సంబంధిత ప్లాట్ఫామ్లో థ్రెడ్లు వార్తలను విస్తరించట్లేదని ఇన్‌స్టా ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎక్స్(ట్విటర్)కు పోటీగా మెటా ఇన్స్టాథ్రెడ్లను జులైలో ప్రారంభించింది. -
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్‌షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్‌లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్‌ల సంఖ్యను కూడా చూపుతుంది. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్‌బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. -
ఆరంభ శూరత్వం..ట్విటర్ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్’!
ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్‌కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. థ్రెడ్స్‌ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్‌లో రోజువారీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది. జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. అదే సమయంలో ట్విటర్ రోజువారీ యాక్టీవ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్‌కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్ ఆప్‌ల విషయంలో మార్క్ జుకర్ బెర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నారు. జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం రోజుల్లో.. లాగిన్ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్ అప్ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్‌కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్‌ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
Twitter vs Threads: అసలేంటీ మెటా థ్రెడ్స్? ట్విటర్ కంటే ఎందుకంత స్పెషల్?
మెటా వారి ‘థ్రెడ్స్’ ట్విట్టర్–కిల్లర్ అవుతుందా లేదా అనేది తెలియదుగానీ ఈ యాప్‌పై యువత అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ట్విట్టర్ కంటే ‘థ్రెడ్స్’ ఏ రకంగా భిన్నమైనది అనే విశ్లేషణ ఒక కోణం అయితే, కొత్తవాటిపై సహజమైన ఆసక్తి మరో కోణం... మెటా వారి టెక్ట్స్ ఆధారిత సంభాషణ యాప్ ‘థ్రెడ్స్’ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యాప్ మొదలైన రెండు గంటలోనే ఇరవై లక్షల మంది యూజర్లు సైనప్ అయ్యారు. నాలుగు గంటలలో ఆ సంఖ్య యాభై లక్షలకు చేరడం చూస్తుంటే థ్రెడ్స్ ‘ట్విట్టర్’కు గట్టిపోటీ ఇవ్వనుందనే విషయం అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ‘థ్రెడ్స్’ డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా యూరప్‌లో అందుబాటులోకి రాలేదు. థ్రెడ్స్‌కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని రెడీ–మేడ్ యూజర్ బేస్ వల్ల ‘థ్రెడ్స్’ ట్విట్టర్‌ని మించిపోతుంది అనే అంచనా ఉంది. ‘థ్రెడ్స్‌పై యూత్ ఆసక్తి ప్రదర్శించడానికి కారణం ఏమిటి?’ ఈ ప్రశ్నకు దేశంలోని వివిధ నగరాలకు చెందిన యువగళాల మాటల్లోనే జవాబు దొరుకుతుంది. ► ట్విట్టర్ ఎలాన్ మస్క్ అధీనంలోకి వచ్చిన తరువాత ప్రయోజనకరమైన మార్పుల కంటే అవసరం లేని మార్పులే ఎక్కువ జరిగాయి. యూజర్ల ట్వీట్ల మీద ఆంక్షలు, బ్లూటిక్స్ పై కొత్త రూల్స్... మొదలైనవి చిరాకు తెప్పించాయి’ అంటుంది ముంబైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్ మనీష. ► థ్రెడ్స్ అనేది ట్విట్టర్‌కు కాపీ–పేస్ట్’ అనే విమర్శ మాట ఎలా ఉన్నా ‘ట్విట్టర్‌తో పోల్చితే భిన్నంగా ఉంది’ అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ‘జుకర్ బర్గ్ కాపీ–పేస్ట్ విధానాన్ని నమ్ముకొని బాహుబలి లాంటి ట్విట్టర్‌ను ఢీ కొనడానికి రంగంలోకి దిగుతాడని నేను అనుకోవడం లేదు. ట్విట్టర్‌తో పోల్చితే థ్రెడ్స్ కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో పోస్ట్ చేసే వీడియోల నిడివి అయిదు నిమిషాలు. ట్విట్టర్లో అయితే రెండు నిమిషాల ఇరవై సెకండ్లు. థ్రెడ్స్‌లో పోస్ట్ పరిమితి అయిదు వందలు. ట్విట్టర్లో రెండు వందల ఎనభై. భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరగవచ్చు’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చైత్ర. ► ‘థ్రెడ్స్’లోని వినూత్నమైన ఫీచర్ ‘ఫెడివర్స్’ యూత్‌కు నచ్చింది. ఆల్టర్నేటివ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘మాస్టడన్’లాంటి వాటితో ‘థ్రెడ్స్’ యూజర్లు ఇంటరాక్ట్ కావచ్చు. ఎప్పటికప్పుడు ప్లాట్‌ఫామ్ మైగ్రేషన్‌లో యూత్ చురుగ్గా ఉంటుంది. ► యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌండర్’కు చెందిన ప్రొఫెసర్ కేసీ ఫైస్లర్ ఆన్లైన్ కమ్యూనిటీని లోతుగా అధ్యయనం చేసిన ‘ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్’గా పేరు తెచ్చుకుంది. ప్లాట్‌ఫామ్ మైగ్రేషన్స్’ గురించి రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసింది. ► ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు మార్చారు? మార్చడం ద్వారా ఎదురైన సవాళ్లు, అనుభవాలు’ అనే అంశంపై యువతరంలో ఎంతోమందితో మాట్లాడింది. ► ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందులోని ఆన్లైన్ కమ్యూనిటీ తట్టాబుట్టా సర్దుకొని కొత్త ప్లాట్ఫామ్లోకి వెళుతుంది. మైగ్రేషన్‌కు సంబంధించి తొలి దశలో కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అందరి కంటే ముందు తామే ఉండాలనుకునేవారితోపాటు, స్నేహితులు కదిలేవరకు కదలని వారు కూడా ఉంటారు’ అంటుంది ఫైస్లర్. ► ట్విట్టర్‌తో పోల్చితే హ్యాష్‌ట్యాగ్స్, వెబ్ వెర్షన్, ఎడిట్ పోస్ట్‌లు, డీఎం ఆప్షన్, ఎఐ జనరేటెడ్ ఆల్ట్ టెక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, క్రోనలాజికల్ ఫీడ్... మొదలైన ఫీచర్స్ ‘థ్రెడ్స్’లో లేవు అనే మాట వినిపిస్తోంది. ►ఎన్నో అంచనాలతో ‘థ్రెడ్స్’లోకి వచ్చిన నవతరాన్ని మెటా నిరుత్సాహ పరుస్తుందా? ఒక మీమ్‌లో చూపినట్లు వేగంగా వచ్చిన వాళ్లు అంతే వేగంగా వెళ్లిపోతారా? ‘థ్రెడ్స్ ద్వారా జుకర్‌బర్గ్ కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు’ అనే ఆశావాదంతో ఎంతకాలమైనా ఎదురుచూసే వాళ్లు ఉంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. ట్విట్టర్ vs థ్రెడ్స్ ఈ మీమ్స్ చూస్తే పొట్టచక్కలు ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ నేపథ్యంలో యువ నెటిజనులు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. ‘ఎట్ ది రేట్ ఆఫ్’ సింబల్‌ని పోలిన ‘థ్రెడ్స్’ లోగో అచ్చం జిలేబిలా ఉందని కొందరు రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఒక మీమ్‌లో... ట్విట్టర్ ఆఫీస్ కిటికీ నుంచి మార్క్ జుకర్‌బర్గ్ దొంగచాటుగా తొంగి చూస్తుంటాడు. ‘థ్రెడ్స్‌లోకి వెళ్లిన వారు కేవలం 5 నిమిషాల తరువాత బ్యాక్ టు ట్విట్టర్ అంటూ ఎలా పరుగెత్తుకు వస్తున్నారో చూడండి’ అంటూ ట్విట్టర్ వీరాభిమానులు వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. నసీబ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, సూర్యవంశ్... మొదలైన బాలీవుడ్ సినిమాల క్లిప్‌లకు ట్విటర్–థ్రెడ్స్‌కు సంబంధించి ఫన్నీ కామెంట్స్ జత చేస్తున్నారు. Elon Musk: I am tweeting Mark Zuckerberg: pic.twitter.com/oVciHtsgWU — Sagar (@sagarcasm) July 6, 2023 People right now balancing on twitter and threads😂 pic.twitter.com/njRzO4tayh — Rishabh Kaushik (@RishabhKaushikk) July 6, 2023 They said this was Mark Zuckerberg at Twitter offices coming up with Threads 🤣 pic.twitter.com/AudgcfE7QS — O.T.G (@365OTG) July 7, 2023 Is it just a coincidence ? Jalebi lovers should sue Mark Zuckerberg .. pic.twitter.com/xMHSQKZGfh — Lost in Paradise 🇮🇳 (@Lost_human19) July 7, 2023 -
మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - ఒక్క రోజులోనే గిన్నిస్ రికార్డ్!
Meta Threads: ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన మెటా థ్రెడ్స్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. విడుదలైన ఒక రోజుకే సంచలనం సృష్టించి ట్విటర్‌కు షాక్ ఇచ్చిన ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకున్న ఒక వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే 10 లక్షల ఫాలోవర్స్ సాధించిన సరి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'జిమ్మీ డోనాల్డ్సన్' (Jimmy Donaldson) మెటా థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) పాతిక సంవత్సరాల డోనాల్డ్సన్ 'మిస్టర్ బీస్ట్' అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాడు. తాజాగా విడుదలైన థ్రెడ్స్ యాప్‌లో కూడా తన హవా చూపించాడు. ఇతడు మెటా థ్రెడ్స్‌లో కేవలం మూడు పోస్టులు మాత్రమే చేసినట్లు సమాచారం. ఈ మూడు పోస్టులకు 1 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారంటే ఇతడెంత ఫెమస్ అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఫాలోవర్స్ పెరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ట్విటర్ ద్వారా పోస్ట్ చేసాడు. The moment @mrbeast reached one million followers on Threads... (yes, this is how we monitored the record) (and yes, it drained the battery from our phone a lot) pic.twitter.com/PwzrUNPa2t — Guinness World Records (@GWR) July 6, 2023 -
మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?
Meta Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' ప్రత్యర్థిగా మెటా ఇప్పుడు కొత్త 'థ్రెడ్స్' (Threads) అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది విడుదలైన అతి తక్కువ సమయంలో మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులు మాత్రమే కాకుండా ఈ యాప్‌ని సెలబ్రిటీలు సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొదటి సెలబ్రిటీ అని భావిస్తున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. దీంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుని వారిని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) నివేదికల ప్రకారం మెటా థ్రెడ్స్ యాప్ కొన్ని గంటల్లోనే ట్విటర్‌ను షేక్ చేసినట్లు తెలిసింది. దీనిని కేవలం 2 గంటల్లో 20 లక్షలు, 4 గంటల్లో 50 లక్షల మంది డౌన్లోడ్ చేకున్నట్లు సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ అధికారికంగా తెలిపాడు. ఈ సందర్భంగా అతడు సుమారు 11 సంవత్సరాల తరువాత ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. ఇది ఎలాన్ మస్క్‌ని ఉద్దేశించి చేసినట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. -
చట్టపరమైన చిక్కుల్లో థ్రెడ్స్.. మార్క్ జుకర్ బర్గ్‌కు నోటీసులు!
ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విటర్‌కు పోటీగా మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మాతృసంస్థ) అధినేత మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ను విడుదల చేశారు. ఈ యాప్ సంచలనాలకు కేంద్రం బిందువుగా మారింది. లాంఛ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 30 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. అదే సమయంలో చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. తమ మేధో సంపత్తిని (intellectual property rights)ను కాపీ కొట్టారంటూ ఎలాన్ మస్క్ తన లాయర్ అలెక్స్ స్పిరో ద్వారా జుకర్ బర్గ్‌కు నోటీసులు పంపించారు. ట్విటర్ వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నోటీసుల్లో అలెక్స్ స్పిరో పేర్కొన్నారు. వీటితో పాటు ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలున్న డజన్ల కొద్దీ మాజీ ట్విటర్ ఉద్యోగులను మెటా నియమించుకుందని లేఖలో ఆరోపించింది. NEWS: Twitter is threatening to sue Meta over "systematic, willful and unlawful misappropriation" of Twitter's trade secrets and IP, as well as scraping of Twitter's data, in a cease-and-desist letter sent yesterday to Zuckerberg by Elon's lawyer Alex Spiro. pic.twitter.com/enWhnlYcAt — T(w)itter Daily News (@TitterDaily) July 6, 2023 తమ సంస్థ వ్యాపార రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఉపయోగించడం మెటా మానుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే మెటాకు ట్విటర్ నోటీసులంటూ వచ్చిన వార్తలను ఉటంకిస్తూ చేసిన ట్వీట్‌కు మస్క్ స్పందించారు. ‘పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు’ అని అన్నారు. ఇక, థ్రెడ్స్‌లో ట్విటర్ మాజీ ఉద్యోగులున్నారంటూ ట్విటర్ పంపిన నోటీసుల్ని మెటా ఖండించింది. థ్రెడ్స్ ఐటీ విభాగంలో మాజీ ట్విటర్ ఉద్యోగులు ఎవరూ లేరని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ థ్రెడ్స్ పోస్ట్‌లో తెలిపారు. మేధో సంపత్తి అంటే? మేధో సంపత్తి అనేది కంటికి కనిపించని ఆస్తుల్లోని ఓ భాగం. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, సాహిత్య, కళాత్మక పని, డిజైన్లు, చిహ్నాలు (సింబల్స్), పేర్లు, చిత్రాలు (ఇమేజెస్) వంటివి ఈ జాబితాలో ఉంటాయి. వీటికి వ్యక్తుల మనసు, తెలివితేటలు ప్రాణం పోస్తాయి. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు. -
మార్గ్ జుకర్‌బర్గ్ ట్వీట్! ఎలాన్ మస్క్ రిప్లై ఇలా..
ట్విటర్‌కు పోటీగా విడుదలైన మెటా థ్రెడ్స్ కొన్ని గంటల్లోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు మెటా సీఈఓ మార్గ్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. కొంతమంది ఈ కొత్త యాప్‌ని ట్విటర్ కిల్లర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జుకర్‌బర్గ్ ట్వీట్.. నిజానికి మెటా సీఈఓ జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేయడం చాలా రోజుల తరువాత ఇదే మొదటి సారి. సుమారు 11 సంవత్సరాల తరువాత మొదటి పోస్ట్ చేసాడు. కొత్త యాప్ లాంచింగ్ సందర్భంగా ఈ ట్వీట్ చేసాడు. ఈ పోస్టులో కనిపించే రెండు స్పైడర్‌మ్యాన్ చిత్రాలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇది ట్విటర్ అధినేత మస్క్‌ను ఉదీసించి పోస్ట్ అని తెలుస్తోంది. pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 జుకర్‌బర్గ్ 2012 జనవరి 18 తరువాత ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడం ఇదే మొదటి సారి. ఈ పోస్టుకి ఇప్పటికి లెక్కకు మించిన లైకులు, కామెంట్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి. థ్రెడ్స్ యూజర్ల సంఖ్య ట్విటర్‌ను మించిపోతుందా అనే ప్రశ్నకు జుకర్‌బర్గ్ ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) ఎలాన్ మస్క్ ట్వీట్.. థ్రెడ్స్ యాప్ దాదాపు ట్విటర్ మాదిరిగానే ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ఇందులో భాగంగా ఒక కీ బోర్డు ఇమేజ్ యాడ్ చేసి Ctrl+C+V (ట్విటర్ కాపీ పేస్ట్) అని రాసాడు. దీనికి స్పందిస్తూ ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఒక ఎమోజి పోస్ట్ చేసాడు. మొత్తానికి అనుకున్న విధంగా మెటా ఒక కొత్త యాప్ తీసుకువచ్చింది. అయితే ఇది ట్విటర్ యాప్‌ని దెబ్బతీస్తుందా.. లేదా అనేది మరి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా థ్రెడ్స్' (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. మెటా థ్రెడ్స్ లాగిన్ విధానం.. ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన కొత్త 'మెటా థ్రెడ్స్' వినియోగించాలనుకునే వ్యక్తి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధారాలను నమోదు చేయండి ప్రొఫైల్ ఫోటో, పేరు, బయో, లింక్‌లు వంటి ఇన్పుట్ వివరాలు ఫిల్ చేయండి.. లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకోవచ్చు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రైవేట్ ప్రొఫైల్ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే మీ పోస్టులు, ఇతర వివరాలు కనిపిస్తాయి. చివరగా జాయిన్ థ్రెడ్‌లపై క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మెటా థ్రెడ్స్ ఉపయోగాలు.. మెటా థ్రెడ్స్ యాప్ ద్వారా కంటెంట్‌ని సృష్టించవచ్చు, లింక్స్ పెట్టవచ్చు, ఫొటోలు, అయిదు నిమిషాల నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ దాదాపు ట్విటర్ ఫీచర్స్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ట్విటర్లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు అప్పటికి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) మెటా థ్రెడ్స్ యాప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులో వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు 500 అక్షరాలా వరకు పోస్ట్ చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్‌కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్‌లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్‌బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ఖాకీ క్రౌర్యం: నేను చెప్పింది చెయ్.. అంతే.. లేదంటే చుక్కలే..
‘పోలీసైతే చాలు.. లైసెన్స్ లేదని వంద నొక్కేయొచ్చు... దొంగోడి దగ్గర సగం కొట్టేయొచ్చు.. ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరి దగ్గరా దండుకోవచ్చు.. అంతెందుకు అసలు ఎవడినైనా తొక్కేయొచ్చు.. ’’ ఓ సూపర్ హిట్ తెలుగు సినిమాలో అవినీతి పోలీసులపై పూరీ జగన్నాథ్ పంచ్ డైలాగ్ ఇది.. ఇప్పుడు ఇదే డైలాగ్ జిల్లాలోని ఒకరిద్దరు అక్రమార్కులకు కచ్చితంగా వర్తిస్తుందనే చెప్పాలి. చాలామంది పోలీసులు నిజాయితీగానే పని చేస్తున్నప్పటికీ.. కొద్దిమంది చేతివాటం, అడ్డగోలు అక్రమార్జన ఇప్పుడు వివాదాస్పదమై జిల్లా పోలీసు శాఖలోనే చర్చనీయమైంది. అసలు విషయమేమిటంటే... సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న హథీరాంజీ కాలనీలో బొడ్డు జయ చంద్ర అనే వ్యాపారి రెయిన్బో కలెక్షన్స్ పేరిట చిన్నపాటి రెడీమేడ్ దుస్తుల షాపు పెట్టుకున్నారు. ఈ మేరకు షాపు భవన యజమాని మాధవీదేవితో 2018 మే నెల 9వ తేదీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. కనీసం ఐదేళ్లపాటు ఆ షాపును అక్కడే కొనసాగించేందుకు సమ్మతిస్తూ ఇరువర్గాలు మాట్లాడుకున్నాయి. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో ఆ క్రమంలో అక్కడ జయచంద్ర దాదాపు ఏడులక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇదిలా ఉండగా, సరిగ్గా 16 నెలలకు మాధవీలత తరఫున కొందరు వచ్చి షాపు ఉన్నట్టుండి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ‘ఇదేమిటి.. ఇప్పుడే చాలా పెట్టుబడి పెట్టాను.. ఐదేళ్ల వరకు కాకపోయినా కొన్నాళ్లు ఆగండి’ అని జయచంద్ర చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. వాదోపవాదాలు, ఘర్షణల స్థాయికి వెళ్తుండడంతో అతను 2019 నవంబర్‌లో తిరుపతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. అప్పటి నుంచి వివాదం కోర్టులోనే ఉంది. ఇక్కడి వరకు జరిగిన పరిణామాలు చాలా చోట్ల అందరూ చూసే ఉంటారు. వినే ఉంటారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అక్రమంగా చొరబడి.. దౌర్జన్యం చేసినా.. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈనెల 5వ తేదీన ఆదివారం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి షాపులోకి జొరబడి.. అక్కడ పనిచేస్తున్న ఓ యువతిని బయటకి పంపివేసి.. షాపునకు తాము తెచ్చుకున్న తాళం వేసి వెళ్లిపోయారు. ఇదంతా సీసీ రికార్డుల్లో నమోదు కావడంతో ఆ ఫుటేజీని తీసుకుని జయచంద్ర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే తన షాపులోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆ స్టేషన్‌లోని ఓ అధికారి ముందు కూర్చుని ఉన్నారు. దీంతో జయచంద్ర ‘సర్.. వీళ్లు నేను లేని సమయంలో నా షాపులోకి వచ్చి దౌర్జన్యం చేశారు... కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడైన జయచంద్రపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషాలు చేస్తున్నావా.. వెంటనే ఖాళీ చేయి.. లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేస్తా.. అని బెదిరించారు. దీంతో బిత్తరపోయిన జయచంద్ర వెంటనే ఉన్నతాధికారిని కలిసి విషయం చెప్పడంతో ఎట్టకేలకు 6వ తేదీన ఎఫ్ఐఆర్(నెం721) నమోదైంది. 448, 427, 341, 506 డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద మాధవీదేవీపైనా కేసు నమోదు చేశారు. కానీ షాపు తాళాలు మాత్రం ఇప్పించేందుకు పోలీసులు నిరాకరించారు. విషయం కోర్టులో ఉంది కదా.. వేచిచూడాలంటూ దాటవేశారు. అయితే ఇదిలా ఉండగానే డిసెంబర్ 21వ తేదీన మరోసారి గుర్తుతెలియని దుండగులు వచ్చి షాపు షట్టర్ తెరిచి లోపల ఉన్న దుస్తుల సరుకును చిందర వందర చేసి పడేశారు. మొత్తం సరుకుతో పాటు టేబుల్స్, రాక్స్, హాంగర్స్, డిస్ప్లే మోడల్స్ అన్నీ తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై వెంటనే బాధితుడు జయచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా. ఎఫ్ఐఆర్ (నం.735)తో 448, 427 సెక్షన్ల కింద మాధవీదేవిపైనా కేసులు నమోదు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా దౌర్జన్యం చేసినా, దానిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. పోలీసులే నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం విడ్డూరం నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు అప్పులు చేసి జీవనోపాధికి బట్టల షాపు పెట్టుకున్నాను. ముందుగానే మాట్లాడుకుని ఓనరుతో ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ వివాదం రేగడంతో కోర్టును ఆశ్రయించాను. కానీ ఓనర్ తరఫున వాళ్లు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఓ అధికారి అయితే స్వయంగా బెదిరించారు. కనీసం షాపు వద్దకు వచ్చి విచారణ చేయాల్సిందిగా ఎన్నిమార్లు బతిమాలినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఘటనా స్థలానికి కూడా రాలేదు. పోలీస్‌స్టేషన్‌కు 200 అడుగుల దూరంలోనే మా షాపు ఉంటుంది. ఇలాగైతే ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎలా ఎక్కుతారు? – జయచంద్ర, ఫిర్యాదుదారు -
మూడు వలలు.. ఆరు తాళ్లుగా ఓ సంత! రూ.100 నుంచి మొదలు..
తగరపువలస: విశాఖ మహా నగరంతో పోటీపడుతున్న తగరపువలసలో వివిధ అవసరాలకు వినియోగించే తాళ్లు, చేపల వేట, పంటల రక్షణకు వినియోగించే వలలు అందుబాటులో ఉంటున్నాయి. విక్రయాలు ఎక్కువగా ఉండటంతో వీటి సంతకు ప్రత్యేక స్థలం లేకపోయినప్పటికీ ప్రతి ఆదివారం ప్రధానరహదారి, డివైడర్లపై వీటి వ్యాపారం మూడు వలలు.. ఆరు తాళ్లుగా సాగుతోంది. వాస్తవానికి భీమిలిలో వ్యవసాయం తక్కువగా ఉన్నప్పటికీ ఆరు మండలాలకు తగరపువలస కేంద్రీకృతం కావడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో కేవలం వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకుని కొబ్బరిపీచుతో తయారు చేసే తాళ్లు మాత్రమే ఇక్కడి మార్కెట్లో అందుబాటులో ఉండేవి. కొబ్బరిపీచు పరిశ్రమలు మూతపడటం, వాటికి ప్రత్యామ్నాయంగా మన్నికైన ప్లాస్టిక్, ఫైబర్ ప్రవేశంతో అన్నిరకాలైన అవసరాలకు అనుగుణంగా తాళ్లు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తాళ్ల వ్యాపారులు ఆదివారం సంతలో వసతులేవీ లేకుండానే కనీసం రూ.లక్ష వ్యాపారం జరుపుతున్నారు. దిగుమతి చేసుకున్నవే.. విశాఖ, కాకినాడ, తాళ్లరేవు, రాజమండ్రి, కోల్‌కతా, ముంబై ప్రాంతాల నుంచి వ్యాపారులు రూ.లక్షలు పెట్టుబడి పెట్టి తాళ్లను తెచ్చి వారంలో నాలుగు రోజులు ముఖ్యమైన సంతల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎండ, వానలలో విక్రయించుకేనే తమకు అనువైన స్థలం ఉంటే వ్యాపారం మరింత మెరుగ్గా సాగుతుందని అంటున్నారు. రూ.100 నుంచి మొదలు.. వ్యవసాయంలో నీళ్లు తోడే ఏతం, మోట బావి, చెట్లు కొట్టడంతో ప్రధానపాత్ర వహించే తాళ్లు ఇప్పుడు అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. చేపల వేట, పంటల రక్షణకు వినియోగించే వలలు, వ్యవసాయ భూముల్లో మేకలు, గొర్రెల మందలను నిలిపి ఉంచడానికి, పశువులను కట్టివేయడానికి కన్నెలు, పొలాలను పాడుచేయకుండా మూతి బుట్టలు, వాటి అందానికి, దిష్టికి తలవెంట్రుకలతో తయారుచేసిన తాళ్లు, చిన్నారుల నుంచి పెద్దలను ఊపే ఊయలలు, ఇంట్లో వేలాడదీసే ఉట్టెలు ఒకటేమిటి అన్ని అవసరాలకు ఉపయోగపడే తాళ్లు బారల లెక్కన విక్రయిస్తున్నారు. గాలి తగిలేలా కూరగాయలను నిల్వ చేసుకోవడానికి వలలు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.100 మొదలుకుని అవసరం, నాణ్యతను బట్టి తాళ్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగం పెరిగింది పూర్వం వ్యవసాయరంగంలోనే తాళ్లను ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు అన్నిరకాల అవసరాలలో తాళ్ల వినియోగం పెరిగింది. విలాసాలకు అవసరమైన ఊయలలు, పెరట్లో మొక్కల రక్షణకు వలలు కొంటున్నారు. గతంలో సంతకు ఒక్కరు మాత్రమే వ్యాపారులు వచ్చేవారు ఇప్పుడు పదుల సంఖ్యలో వస్తున్నారు. అయినప్పటికీ అందరి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – మైలపల్లి నరసింహులు, వ్యాపారి, రణస్థలం -
ఫేస్బుక్ కొత్త యాప్, ‘థ్రెడ్స్’ చూశారా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం తన ప్రత్యర్థి స్పాప్చాట్తో సోషల్ మీడియా సమరానికి సై అంది. తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేక కెమెరా-ఫస్ట్ మెసేజింగ్ యాప్ "థ్రెడ్స్" ను లాంచ్ చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. థ్రెడ్స్ ద్వారా, వినియోగదారులు తమ సన్నిహితులతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్, షేర్ లొకేషన్, బ్యాటరీ స్టేటస్‌ను అప్లోడ్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. సన్నిహితులకోసం ప్రత్యేకంగా ఈ యాప్ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఫేస్బుక్ దాని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి సారించింది, ఎందుకంటే దాని ప్రధాన వేదిక గోప్యత , తప్పుడు సమాచారం లేదా నకిలీ వార్తల వ్యాప్తికి సంబంధించి నియంత్రకుల నుండి పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొత్త అప్డేట్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో థ్రెడ్స్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. యాపిల్, గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ద్వారా నడిచే స్మార్ట్ఫోన్లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించింది. ఫేస్బుక్ డేటా లీక్ సృష్టిస్తున్న వివాదం నేపథ్యంలోఈ యాప్ చాలా సురక్షితమైందని ఫేస్బుక్ హామీ ఇచ్చింది. థ్రెడ్స్ ఒక స్వతంత యాప్. ఇతర మెసేజ్ యాప్‌ల మాదిరిగానే వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, సందేశాలు, స్టోరీస్‌ను షేర్ చేసుకోవచ్చు. విజువల్ మెసేజింగ్ స్టైల్లో ఫోటోలు లేదా వీడియోలను సులభంగా భాగస్వామ్యం చేస్తుంది. అలాగే తమ పోస్ట్‌లో ఎవరు చూడవచ్చో, చూడకూడదో "క్లోజ్ ఫ్రెండ్స్" ఫీచర్ ద్వారా నియత్రించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇన్‌బాక్స్ , నోటిఫికేషన్లు ఉంటాయి. డైరెక్టుగా కెమెరాతో ఒపెన్ అయ్యి షార్ట్కట్స్తో కేవలం రెండే రెండు క్లిక్స్ తాము అనుకున్న కంటెంట్‌ను యాడ్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ మాదిరిగానే స్టేటస్ ఫీచర్ కూడా ఉంది. -
కలర్‌ఫుల్ కుచ్చులు..
ఇప్పటివరకు ఎన్నో రకాల జ్యుయెలరీ మేకింగ్స్ను చూశాం. కానీ టాసెల్ జ్యుయెలరీని చూశారా? అదేనండీ దారాల కుచ్చు.. మీ డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే దారంతో సులువుగా జ్యుయెలరీ తయారు చేసుకోవచ్చు. రోజూ వేసుకునే జ్యుయెలరీనే కొత్తగా మార్చుకోవాలనుకుంటే.. రెండు మూడు కుచ్చులను వాటికి తగిలిస్తే సరి. ఈ జ్యుయెలరీ మేకింగ్‌కు ఒక్క టాసెల్స్ తయారీ తెలిస్తే చాలు. కావలసినవి: రంగురంగుల దారాలు, కత్తెర కుచ్చుల తయారీ: ముందుగా ఏ రంగు జ్యుయెలరీ కావాలనుకుంటే ఆ రంగు దారాన్ని తీసుకోండి. దాన్ని కావలసినంత పొడవులో 25-30 సార్లు చుట్టండి. ఇప్పుడు సరిగ్గా దాని మధ్యలో ఓ చిన్న దారంతో ముడి వేయాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా మధ్యభాగంలోని సన్న దారాన్ని పట్టుకొని, ఇరువైపుల దారాలను మరోదారంతో ముడివేయాలి. ఆపైన చివర్లను కత్తెరతో కట్ చేస్తూ సమానంగా చేసుకోవాలి. అంతే అందమైన కలర్‌ఫుల్ కుచ్చు రెడీ. ఇప్పుడు ఈ కుచ్చుతో ఫొటోలోని జ్యుయెలరీని ఎంతో అందంగా.. ఈజీగా చేసుకోవచ్చు. చెయిన్స్‌కు, బ్రేస్‌లెట్స్‌కు లాకెట్లలా మార్చి, డ్రెస్‌కు మ్యాచ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇయర్రింగ్స్ కావాలంటే.. ఈ కుచ్చుకు ఒక హుక్ లేదా రింగ్ తగిలిస్తే చాలు. అలాగే కాళ్ల పట్టీలను కూడా రంగురంగుల కుచ్చులతో అలంకరించొచ్చు.