థ్రెడ్స్ యాప్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా లాంచ్ చేసిన వారం రోజుల్లోపే ఈ యాప్ 100 మిలియన్ల యూజర్లు దాటినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ‍్చాయి. సోమవారం మధ్యాహ్నాం 12.30 గంటలకు 100 మిలియన్ యూజర్లను దాటింది.
ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కు లింక్ చేస్తూ థ్రెడ్స్ అనే యాప్‌ను యూజర్లకు అందించారు. యురోపియన్ యూనియన్ మినహాయించి 100కి పైగా దేశాల యూజర్లు ఈ యాప్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించారు.
రాకెట్ వేగంతో
అలా ఈ యాప్ లాంచ్ అయ్యిందో లేదో తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలు తెరవగా.. 4గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. రోజులు గడిచే కొద్దీ యూజర్ల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. యూజర్లు అంతకంతకూ పెరగడానికి ముఖ్య కారణం ఇన్‌స్టాగ్రామ్‌కు థ్రెడ్స్‌ను జత చేయడమే. ఇన్‌స్టా నెలవారీ 2.35 బిలియన్లకు పైగా యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. వారే థ్రెడ్స్ యాప్‌నూ ఉపయోగించేందుకు మక్కువ చూపుతున్నారు.
విడివిడిగానే
థ్రెడ్స్ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు ఇంటిగ్రేషన్ చేసి ఉంది. ఇక్కడే యూజర్లకు సమస్యలు తలెత్తుతున్నాయి. థ్రెడ్స్‌ను లాగిన్ అవ్వాలంటే..ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాల్సి వస్తుంది. దానికి పరిష్కారం చూపేందుకు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో, వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో వారి ప్రొఫైల్, పోస్ట్‌లను హైడ్ చేసి థ్రెడ్ అకౌంట్‌లను డీయాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టా నుంచి థ్రెడ్స్ యాప్‌ను విడగొడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది? యూజర్లు ఏమైనా తగ్గుతారా? అనే అంశంపై నిపుణులతో మోస్సేరి చర్చిస్తున్నారు. చివరిగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంగా కాకుండా ఉంటే ఇన్‌స్టాను, థ్రెడ్స్‌ను విడివిడిగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం, థ్రెడ్స్‌కు పెరిగిపోతున్న యూజర్లు ఎలాన్ మస్క్‌ను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.
మెటాపై దావా
థ్రెడ్స్ మాతృ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టేలా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెటా కాపీరైట్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందని, ట్విటర్ ఫీచర్లు, ఇతర సంబంధిత రహస్యాలను సేకరిస్తుందని ఆరోపిస్తూ మెటాపై దావా వేస్తున్నట్లు తెలిపారు.
ట్విటర్ ర్యాకింగ్ పడిపోయింది.
థ్రెడ్‌లు వారంలోపే 100 మిలియన్ల యూజర్ మార్క్‌ను దాటగా.. యాక్టీవ్ యూజర్లు ఎంతమంది ఉంటారో చూడాల్సి ఉంది. ఈ సందర్భంగా క్లౌడ్‌ఫ్లేర్ సీఈవో మాథ్యూ ప్రిన్స్ థ్రెడ్స్‌లో ట్విటర్ డీఎన్‌ఎస్ ర్యాంకింగ్ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో పడిపోయిందని చెప్పారంటూ వెర్జ్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment