Elon Musk Reacts As Twitter Threads Release Date Confirmed, See Details Inside - Sakshi
Sakshi News home page

Twitter Vs Threads: ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’.. యూజర్ల వ్యక్తిగత డేటా గోప్యతపై తీవ్ర విమర్శలు

Published Tue, Jul 4 2023 12:14 PM | Last Updated on Tue, Jul 4 2023 1:05 PM

Elon Musk Reacts Twitter Threads Release Date Confirmed - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ విచిత్రంగా స్పందించారు. 

ఇటీవల,ట్విటర్‌లో రోజుకు వీక్షించే ట్వీట్‌లపై ఎలాన్‌ మస్క్‌ ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ట్విటర్‌ బాస్‌ మాత్రం తాను చేస్తున్న చర్యల్ని సమర్ధించుకున్నారు. యూజర్లు ట్విటర్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదే సమయంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న థ్రెడ్‌ యాప్‌ను యూజర్లకు అందిస్తున్నట్లు మెటా తెలిపింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ప్లే స్టోర్‌ సైతం ఆ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.  

ఈనేపథ్యంలో ఎన్ ఎఫ్‌టీ టెక్నాలజీ సీఈవో మారియో నౌఫల్ థ్రెడ్‌ యాప్‌ గురించి ట్వీట్‌ చేశారు. థ్రెడ్‌ యాప్‌ విడుదలపై స్పష్టత వచ్చింది. జులై 6న అమెరికాలో విడుదల కానుంది. మెటాలోని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లుగా.. మెటా లక్ష్యం నీతి, నిజాయితీ, విలువలతో కూడిన సోషల్ మీడియా సైట్‌ను అభివృద్ది చేయడం. అయినప్పటికీ, యాప్ తన వివరణలో పేర్కొన్నట్లుగా ‘సనేలీ రన్’ అనే పదం యాప్ మీ మొత్తం డేటాను సేకరిస్తుంది అని సూచించేలా ఉంది. వ్యక్తిగతంగా, అది నిజమేనని నేను గట్టిగా నమ్ముతాను. 

ట్విటర్ ఉన్నత ఆశయాలతో పనిచేస్తుంది. జుకర్‌ బర్గ్‌ అందుకు విరుద్ధం. వాక్ స్వాతంత్య్రానికి నిజమైన ఛాంపియన్‌ అతనే అంటూ వెటకారంగా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలం అంశం ఏంటంటే? థ్రెడ్‌ యాప్‌ విషయంలో జుకర్‌ బర్గ్‌తో పోటీ పడేందుకు ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే సిద్ధంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అందుకు ఇయాన్ జెల్బో అనే మరో నెటిజన్‌.. ఆశ్చర్యం పోవడానికి అందులో ఏమీ లేదు. ఎందుకంటే ట్విటర్‌ ప్రత్యర్ధి మెటా మన డేటాను కలెక్ట్‌ చేస్తుందంటూ కొన్ని ఆధారాలు చూపిస్తూ వాటిని ట్వీట్‌ చేశాడు.

ఆ ట్వీట్‌లకు మస్క్‌ తనదైన శైలిలో స్పందించారు. కృతజ్ఞత, వాళ్లు చాలా తెలివిగా నడుచుంటున్నారని పేర్కొన్నారు. మరి థ్రెడ్స్‌ విడుదల, డేటా గోప్యతపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్పందించాల్సి ఉంటుంది.  

చదవండి👉 ట్విటర్‌ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement