Meta To Announce Fresh Layoffs Across Facebook, Instagram And WhatsApp - Sakshi
Sakshi News home page

Meta Layoffs 2023: షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు!

Published Wed, Apr 19 2023 11:49 AM | Last Updated on Wed, Apr 19 2023 12:11 PM

Meta To Announce Fresh Layoffs - Sakshi

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా మరో సారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది. 

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. తాజా లేఆఫ్స్‌పై మేనేజర్లుకు మెటా మెమో పంపింది. ఆ మెమోలో ఉద్యోగుల్ని కోత విధించే విషయంలో సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌,ఇన్‌స్టా, వర్చువల్‌ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్స్‌,క్విస్ట్‌ హార్డ్‌ వంటి విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. 

కాస్ట్‌ కటింగ్‌ విషయంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు10 వేల మంది ఉపాధి కోల్పోనున్నట్లు జుకర్‌ బర్గ్‌ ఈ ఏడాది మార్చి నెలలో ప్రకటించిన విషయం తెలిసింది. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఇప్పుడు తొలగింపుల అంశం మరోసారి  తెరపైకి వచ్చింది.   

తాజాగా మేనేజర్‌లకు పంపిన మెమోలో ఉద్యోగులు సైతం కొత్త మేనేజర్ల పర్యవేక్షణలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, వర్క్‌ను విభజించినప్పుడు వివిధ విభాగాల ఉద్యోగులు వారితో పనిచేయాల్సి వస్తుందని సూచించింది.  కాగా, ఈ సందర్భంగా మెటా ప్రతినిధి లేఆఫ్స్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. 

5 నెలల్లో ఇది రెండోసారి  
5 నెలల్లో మెటా భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇది రెండో సారి. గత నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల్ని మరోసారి తొలగిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలియజేసింది. కొత్త నియామకాల్ని నిలిపివేసింది. ‘ప్రతికూల వ్యాపార’ పరిస్థితుల నేపథ్యంలో, సంస్థ ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు వ్యయాలు తగ్గించుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి👉 ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్‌ కత్తి, 2.70 లక్షల మంది తొలగింపు..ఎప్పుడు? ఎక్కడా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement