న్యూయార్క్: ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా మరో 10,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు మంగళవారం ప్రకటించింది. అలాగే కొత్తగా 5,000 మందిని విధుల్లోకి తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. నాలుగు నెలల్లోనే రెండవ పర్యాయం ఉద్యోగుల కోతకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సంస్థ చరిత్రలో అత్యధికంగా 2022 నవంబర్‌లో 13 శాతం (11,000) మంది ఉద్యోగులను మెటా తొలగించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల కోత రాబోయే రెండు నెలల్లో జరుగుతుందని సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు.
‘పునర్నిర్మాణాలు, తొలగింపులను మా సాంకేతిక సమూహాలలో ఏప్రిల్ చివరలో, వ్యాపార సమూహాలలో మే నెలాఖరులో ప్రకటించాలని భావిస్తున్నాము’ అని తెలిపారు. ఉద్యోగుల కోత పూర్తి అయితే మొత్తం సిబ్బంది సంఖ్య సుమారు 66,000లకు వచ్చి చేరనుంది. 2022 సెపె్టంబర్ చివరినాటికి 87,314 మంది సంస్థలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment