
ఉద్యోగులకు మెటా హెచ్చరికలు జారీ చేసింది. సెకండ్ ఆఫ్ ఇయర్‌లో (ఫైనాన్షియల్ ఇయర్ - 6నెలలు) సంస్థ మెరుగైన ఫలితాలు సాధించేలా ఉద్యోగులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని ఉద‍్యోగులకు ఇంటర్నల్ మెమో జారీ చేసింది.భవిష్యత్‌లో మరింత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉందని ఆ మెయిల్‌లో పేర్కొంది.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మెటా ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శల కారణంగా మెటా యాడ్స్ బిజినెస్ (ఉదా:బ్రాండ్ పెయిడ్ ప్రమోషన్స్,సేల్స్) భారీగా పడిపోయింది.దీంతో ఆ సంస్థకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఖర్చులు తగ్గించి, ఉద్యోగాల నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ మెమోలో హైలెట్ చేశారు.
ఆదాయం పడిపోయింది
క్రిస్ కాక్స్ మెమోలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మెటా పనితీరుపై సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అధ్యక్షతన అంతర్గత సమావేశం జరిగింది. మెటా ఉన్నత స్థాయి ఉద్యోగులతో జుకర్ బర్గ్ నిర్వహించిన భేటీలో మెటా ఆదాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతేడాది యాపిల్ సంస్థ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ(ఏటీటీ) పేరుతో తెచ్చిన కొత్త పాలసీ కారణంగా మెటాకు వచ్చే ఆదాయం తగ్గినట్లు జుకర్ బర్గ్ గుర్తించినట్లు కాక్స్ చెప్పారు. కాబట్టే అందుకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త రిక్రూట్ మెంట్ ఆపేస్తున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగులతో జుకర్ బర్గ్
అంతర్గత సమావేశంలో జుకర్ బర్గ్ ఉద్యోగులతో క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించారు. ఉద్యోగులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జుకర్ బర్గ్ స్పందిచారు. ఆయన మాట్లాడుతూ..నా వరకు ఇదే నేను ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి బయట పడే శక్తి సామర్ధ‍్యాలున్నాయి.ఇతర కారణాల వల్ల ఈ ఏడాదిలో సుమారు 30శాతం మెటా ఇంజనీర్లను తగ్గించే అవకాశం ఉంటుందని జుకర్ బర్గ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment