ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మారిన మార్క్ జుకర్‌బర్గ్‌ను కష్టాలు వీడటం లేదు. గతంలో కంటే ఎక్కువ విమర్శలు రావడంతో పాటు కంపెనీకి నష్టాలు కూడా వస్తున్నాయి. అక్టోబర్ 29న జరిగిన కనెక్ట్ ఈవెంట్‌లో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాతృ సంస్థ పేరును మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు కొత్తలోగో ఆవిష్కరణ కూడా జరిగింది. తాజాగా, ఆ కొత్త లోగో మీద విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే, ఫేస్‌బుక్ మాతృ సంస్థ "మెటా" కొత్త లోగో వేరే కంపెనీ లోగో లాగా కనిపిస్తుంది.
ఈ కొత్త లోగోపై సదురు కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనికి చెందిన కంపెనీ 'ఎం-సెన్స్ Migräne' లోగో, ఫేస్‌బుక్ మాతృ సంస్థ లోగో ఒకేవిధంగా ఉన్నాయి. సదురు కంపెనీ ట్విటర్ వేదికగా ఇలా రాశారు..""మా మైగ్రేన్ యాప్ లోగో నుంచి ప్రేరణ పొందిన @facebook మాకు చాలా గౌరవం ఉంది. బహుశా వారు మా డేటా గోప్యతా పద్ధతుల నుంచి కూడా ప్రేరణ పొందుతున్నట్లు తెలుస్తుంది" అని పేర్కొంది. అయితే, ఈ విషయంపై ట్విటర్లో భారీగా మిమ్స్ వర్షం కురుస్తుంది. లోగో కూడా కాపీ చేయాలా అంటూ ఫేస్‌బుక్ ను ఏకి పారేస్తున్నారు. 2016లో 'ఎం-సెన్స్ Migräne' యాప్ ను అభివృద్ది చేశారు.
We are very honoured that @facebook felt inspired by the logo of our migraine app - maybe they’ll get inspired by our data privacy procedures as well 👀 🤓
— M-sense Migräne (@msense_app) October 29, 2021
#dataprivacy #meta #facebook pic.twitter.com/QY7cota36r
(చదవండి: భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?)
Comments
Please login to add a commentAdd a comment